Nara Lokesh : ఏపీకి పెట్టుబడుల వరద.. చంద్రబాబు, లోకేష్‌ ఘనత..

Update: 2025-10-21 12:15 GMT

ఏపీకి పెట్టుబడుల వరద పారుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ విశ్వ ప్రయత్నాలు చేసి ప్రపంచ స్థాయి కంపెనీలను ఏపీకి తెస్తున్నారు. ప్రస్తుతం నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. అక్కడ కంపెనీలతో మాట్లాడుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ సౌత్ వేలో తో పాటు తదితర యూనివర్సిటీలలో పర్యటించి అక్కడున్న విద్యా విధానాలను పరిశీలించారు. ఏపీలో విద్యా వ్యవస్థను ఆధునీకరించడం కోసం తన పర్యటనను ఆయన ఈ విధంగా వినియోగించుకున్నాడు. ఇలా ఆస్ట్రేలియాలో పెట్టుబడుల కోసం, విద్యావిధానాల కోసం పర్యటిస్తున్నారు. ఏఐ కంపెనీలతో లోకేష్ మాట్లాడుతున్నారు. ఆ విషయాలను కూడా ఎప్పటికప్పుడు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఏపీ యూనివర్సిటీల నుంచి టై అప్ అయి ఆస్ట్రేలియా యూనివర్సిటీలకు మారేందుకు ఎంవోయూలు కూడా కుదిరే ఛాన్స్ ఉంది. రేపటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు యూఏఈలో పర్యటిస్తారు. మూడు రోజుల పాటు పర్యటనలో బిజినెస్ పర్సన్లను ఆహ్వానించబోతున్నారు.

విశాఖలో జరగబోయే ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ కు వాళ్లను ఆహ్వానించనున్నారు. సీఎం చంద్రబాబు, లోకేష్ గత ఏడాదిన్నర కాలంగా పెట్టుబడుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రూ.10 లక్షల కోట్ల దాకా పెట్టుబడులకు ఎంవోయూలు కూడా అయిపోయాయి. గూగుల్ డేటా సెంటర్ రావడం ఇందులో ఒక చరిత్ర అనే చెప్పుకోవాలి. ఈ డేటా సెంటర్ పై వైసీపీ రకరకాల తప్పుడు ప్రచారాలు చేస్తోంది. ఈ డేటా సెంటర్లు అమెరికా, చైనాలో ఎక్కువగా ఉన్నాయి. ఈ డేటా సెంటర్ల వల్ల టెక్ ప్రపంచం మొత్తం అక్కడే కేంద్రీకృతం కాబోతోంది. మన దేశం డేటా మొత్తం ఇక్కడి నుంచే రాబోతోంది. కానీ ఈ విషయాలు వైసీపీకి తెలియక పిచ్చి ప్రచారాలు చేస్తోంది.

అంతే కాకుండా కూటమి ప్రభుత్వంలో పెట్టుబడులు రాకుండా రకరకాల కుట్రలు చేస్తోంది. సదరు కంపెనీలకు వైసీపీ నుంచి మెయిల్స్ పంపిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ భూములను తీసేసుకుంటామని బెదిరిస్తున్నారు. ఎందుకంటే పెట్టుబడులు వస్తే ఏపీ బాగుపడిపోతుంది, కూటమికి ఇమేజ్ పెరుగుతుందనేది వైసీపీ కుట్ర. ఓ వైపు కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఏపీకి పెట్టబుడులు తీసుకురావడంతో లోకేష్‌ ను చూసి నేర్చుకోవాలంటూ ఆయా రాష్ట్రాల ఐటీ మంత్రులను తిట్టిపోస్తున్నాయి. కానీ వైసీపీ మాత్రం కావాలనే ఉద్దేశపూర్వకంగా పెట్టుబడులపై తప్పుడు ప్రచారాలు చేస్తోంది. కాబట్టి ఈ విషయంలో వైసీపీ ఇప్పటికైనా నిజాలు ఒప్పుకుంటే ప్రజల నుంచి చీవాట్లు తప్పుతాయి.

Tags:    

Similar News