Srikakulam: తాను తీసిన కన్నంలో తానే చిక్కుకున్న దొంగ..
Srikakulam: చోరీకి వచ్చిన దొంగ... కన్నంలో చిక్కుకొని అడ్డంగా దొరికిపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.;
Srikakulam: చోరీకి వచ్చిన దొంగ... తాను వేసిన కన్నంలో చిక్కుకొని అడ్డంగా దొరికిపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కంచిలి మండలం జాడుపూడిలోని ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి నగలపై కన్నేసి దుండగుడు... ఎలాగైనా అపహరించాలని పక్కాప్లాన్‌తో వెళ్లాడు. అదనుచూసుకుని గుడి కిటికికి కన్నంవేసి అమ్మవారి నగలను మూటగట్టుకున్నాడు. కన్నంలో నుంచి బయటపడే క్రమంలో..ఇరుక్కపోయి స్థానికులకు చిక్కాడు. నగల అపహరణ యత్నంతో ఆగ్రహించిన జాడుపూడి వాసులు... దుండగుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. దుండడుగు కంచిలికి చెందిన పాపారావుగా గుర్తించారు