AP : ఎమ్మెల్సీ పోటీకి కూటమి దూరం.. కారణం ఇదేనా?

Update: 2024-08-13 13:45 GMT

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరం గా ఉండాలని 'కూటమి' నిర్ణయం తీసుకుంది. విజయానికి అవసరమైన బలం లేనందున పోటీ చేయకపోవడమే మంచిదని మెజారిటీ నేతలు అభిప్రాయపడినట్టు చెబుతున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఈ ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి నిర్ణయాన్ని ప్రకటించారు.

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొత్తం 838 మంది ఓటర్లు (జెడ్పీ టీసీ, ఎంపీటీసీ సభ్యులు, జీవీఎంసీ కార్పొరేటర్లు, నర్సీపట్నం, ఎలమం చిలి కౌన్సిలర్లు) ఉన్నారు. ఎన్నికల్లో గెలుపొందాలంటే 420 ఓట్లు రావాలి. కూటమికి రమారమి 230 ఓట్లు ఉన్నాయి. దీంతో టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News