ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. నంద్యాల కేసు విషయంలో నటుడు అల్లు అర్జున్ పై నమోదైన కేసు విషయంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. అల్లు అర్జున్‌పై నంద్యాల పోలీసులు ఇచ్చిన పిటిషన్‌ను కొట్టివేయాలని ఆదేశించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడు మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఆయన అభిమానులు భారీగా అక్కడకు చేరుకున్నారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అనుమతి లేకుండా నంద్యాలలో జనసమీకరణ చేపట్టారంటూ కేసు నమోదు చేశారు. అయితే, దానిని కొట్టివేయాలంటూ అర్జున్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు, అల్లు అర్జున్ పటిషన్లను పరిశీలించిన కోర్టు తుది తీర్పు వెల్లడించింది. పోలీసుల పిటిషన్‌ను కోర్టు కొట్టేయడంతో బన్నీకి ఊరటదక్కినట్టయింది.