Tirupati : అమరావతి రైతు మహాసభకు పోటెత్తిన జనం..!

తిరుపతి వేదికగా జరుగుతున్న అమరావతి రైతు మహా సభకు.. జనం పోటెత్తారు. సభకు ప్రజలు రాకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా.. జన ప్రభంజనంతో తిరుపతి వీధులు నిండిపోయాయి.;

Update: 2021-12-17 07:41 GMT

తిరుపతి వేదికగా జరుగుతున్న అమరావతి రైతు మహా సభకు.. జనం పోటెత్తారు. సభకు ప్రజలు రాకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా.. జన ప్రభంజనంతో తిరుపతి వీధులు నిండిపోయాయి. వివిధ జిల్లాలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివాడంతో.. నగరమంతా కోలాహలంగా మారింది. సభ ప్రాంగణం అప్పుడే జనంతో కిక్కిరిసిపోగా.. టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం ముఖ్యనేతలు సభకు చేరుకున్నారు. అమరావతి గొప్పతనాన్ని, ఖ్యాతిని.. ఆంధ్రప్రదేశ్‌కు బలమైన రాజధాని ఉండాల్సిన అవసరాన్ని.. సాంస్కృతిక కళకారాలు నృత్య, గీతాల రూపంలో వివరిస్తున్నారు. ఆంధ్రుల కలల రాజధాని ఒక్కసారిగా ఆగిపోవడం వల్ల.. రాష్ట్రం ఏ స్థితికి వెళ్లిందో.. కళకారులు వివరించారు. పెద్ద ఎత్తున వచ్చిన మహిళలు, రైతులు, అమరావతి రాజధానిని కాంక్షించేవారితో సభా స్థలి కళకళలాడుతోంది. జై అమరావతి.. జైజై అమరావతి నినాదాలతో మార్మోగుతోంది.

Tags:    

Similar News