పల్నాడు జిల్లా చరిత్రలో మొదటిసారిగా అమరావతి వరద ముంపునకు గురైంది. కృష్ణానదికి భారీగా వరదనీరు రావడంతో అమరావతి అమరేశ్వరాలయం దాటి వరద ప్రవహిస్తోంది. పల్లపు వీధి, ముస్లిం కాలనీలోకి వరద చొచ్చుకెళ్ళింది. రహదారులపై నాలుగు అడుగుల మేర వరద నీరు నిలిచింది. పడవల సాయంతో స్థానికులు వీధుల్లో తిరుగుతున్నారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు పరిస్థితిని చక్కబెడుతున్నాయి.
ఆదివారం తెల్లవారుజాము నుంచే ఆయా ప్రాంతాలకు వరద చేరుతూ మధ్యాహ్నానికి వేలాది గృహాల్లోకి వరదనీరు ప్రవేశించింది. ఏ ఇంటిని చూసినా వరద నీటిలోనే మునిగి కనిపిస్తోంది. అదేవిధంగా ఆయా ప్రాంతాలను వరద చుట్టేయడం, పలు ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు నేలమట్టం కావడంతో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో విజయ వాడ నగరంలోని 12 డివిజన్లు అంధకారంలో ఉన్నాయి.