ఏపీ ప్రజల కలల రాజధాని అమరావతికి ఎట్టకేలకు చట్టబద్ధత వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రాజధానిగా అమరావతిని ఎవరూ మార్చలేరు. ఒకవేళ మార్చాల్సి వస్తే చట్టసభల్లో సవరణ చేయాల్సిందే. అది అంత ఈజీ కాదు కాబట్టి ఇక రాజధానికి తిరుగులేదు. గతంలో చట్టబద్ధత లేక జగన్ తన ఇష్టారాజ్యంగా మూడు రాజధానులు అంటూ ఏపీ ప్రజలను నానా ఇబ్బందులు పెట్టాడు. అమరావతి రైతులను ఎన్ని కష్టాలు పెట్టాడో మనం కనులారా చూసాం. తన అరాచకాలకు హద్దే లేకుండా ఏపీని సర్వనాశనం చేశాడు. ఆ అరాచకాలను తట్టుకోలేక ఏపీ ప్రజలు కూటమి ప్రభుత్వంకు పట్టం కట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని చక్కదిద్దుతూ మళ్లీ గాడిన పెట్టారు.
ఇప్పుడు అమరావతిని శాశ్వతంగా ఉంచేలా సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటినుంచో చక్రం తిప్పుతున్నారు. ఆయన వ్యూహంలో భాగంగా నేడు అమరావతికి చట్టబద్ధత అయిపోయింది. కాబట్టి రేపు ఎవరి ప్రభుత్వం వచ్చినా సరే అమరావతిని కదల్చలేరు. చంద్రబాబు నాయుడు ఈ చట్టబద్ధత కోసం ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు అన్ని విధాలుగా సక్సెస్ అయ్యారు. ఎలాగో అమరావతికి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి కంపెనీలు కూడా వచ్చుతున్నాయి. కాబట్టి దాన్ని కదల్చకుండా చేయాలంటే ఈ చట్టబద్ధత అవసరమైంది.
ఇక జగన్ తన ఆటలు సాగవు అని తెలిసి తెగ ఫీల్ అయిపోతున్నాడు అంట. ఎందుకంటే భవిష్యత్తు లో అధికారంలోకి వస్తే ఈ చట్టబద్ధత లేకపోతే తన ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేసే ఛాన్స్ ఉండేది. తన అనుచరులకు అనుకూలంగా రాజధానులను మార్చుతూ భూములను కొట్టేసే ప్లాన్ వేసేయచ్చు అనేది జగన్ ప్లాన్. కానీ దానికి చంద్రబాబు నాయుడు చెక్కుపెట్టేయడంతో వైసీపీకి ఒకరకంగా మాస్టర్ స్ట్రోక్ ఇచ్చినట్టే అయిపోయింది. ఇక సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే అమరావతిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం ఒక్కటే మిగిలింది.