కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 18న ఏపీకి రానున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకొని అదే రోజు రాత్రి ఉండవల్లిలోని సీఎం నివాసంలో విందుకు హాజరవుతారు. అనంతరం విజయవాడ హోటల్‌లో బస చేస్తారు. 19న ఉదయం కొండపావులూరులో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెంటర్‌తో పాటు NDRF పదో బెటాలియన్ ప్రాంగణాలను ప్రారంభిస్తారు. బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్తారు.
కాగా, ఎల్లుండి గుంటూరు, కడప జిల్లాలో పర్యటించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అదే రోజు సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు మర్యాదపూర్వకంగా డిన్నర్ ఇవ్వబోతున్నారు.. ఆ తర్వాత రోజు.. అంటే ఈ నెల 19వ తేదీన దావోస్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. మొత్తంగా ఈ నెల 18వ తేదీన ఏపీకి చేరుకోనున్న ఆయన.. 19వ తేదీన ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొననుండడంతో.. రాష్ట్రంలో రెండు రోజుల పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పర్యటన కొనసాగనుంది