అనంతలో పొలిటికల్ హీట్..టీడీపీ, వైసీపీ నేతల మధ్య బస్తిమే సవాల్
అనంతపురం జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది;
అనంతపురం జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతుంది. అభివృద్ధిపై చర్చకు రావాలంటూ రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. రామచంద్రారెడ్డి సవాల్‌ను స్వీకరించిన మాజీ మంత్రి కాలువ.. ఎన్ హనుమాపురం వేదికగా చర్చకు రెడీ అంటూ ప్రతీ సవాల్ విసిరారు. ఇక అభివృద్ధిపై ప్రశ్నించిన ఉప సర్పంచ్‌పై కేసు పెడతారా అంటూ కాలువ శ్రీనివాస్ మండిపడ్డారు. నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.