Andhra Pradesh: జగన్ సర్కార్‌పై పెరిగిపోయిన వ్యతిరేకత
మహిళా నేతలపై అసభ్యకర ట్రోల్స్ చేస్తూ వికృతానందాన్ని పొందుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి;
ఏపీలో జగన్ సర్కార్‌పై వ్యతిరేకత పెరిగిపోయింది. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్న వైసీపీ శ్రేణులు నీచమైన పనికి దిగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. టీడీపీ సానుభూతిపరులుమహిళా నేతలపై అసభ్యకర ట్రోల్స్ చేస్తూ వికృతానందాన్ని పొందుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.మ హిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వార్తలు పోస్ట్ చేయడం, సోషల్ మీడియాలో మహిళలను టార్గెట్ చేయడం, పర్సనల్ లైఫ్ పైనా తీవ్ర పదజాలంతో రాతలు రాయడం వంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్న ఘటన ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున బయటపడుతున్నాయి.
ఇక చిల్లర కామెంట్లు, ఫేక్ న్యూస్‌తో సోషల్ మీడియాలో యుద్ధాన్ని ప్రకటించిన వైసీపీ సోషల్ మీడియా విభాగం అంతటితో ఆగకుండా మహిళా నేతల ఫోన్‌లకు అభ్యంతరకర మెసేజ్‌లు పంపిస్తూ బరితెగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.మార్ఫింగ్ చేసిన ఫోటోలు..కించపరిచే కామెంట్లతో చిల్లర పనులకు దిగుతున్నారు.వందల సంఖ్యలో అసభ్య మెస్సేజ్‌లు పంపుతుండటంతో మహిళా నేతలు ధైర్యం కోల్పోయి వెనకడు వేస్తున్నారు. కొంతమంది మహిళలు భయపడిపోతున్నారు.వారి కుటుంబసభ్యులు కూడా వారిని రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిది అన్నట్లు సూచిస్తున్నారట. వైసీపీ సోషల్ మీడియాకు కూడా సరిగ్గా ఇదే రిజల్ట్స్ కావాలన్నట్లు వ్యవహరిస్తున్నారట. భయపడిపోయి సోషల్ మీడియాల్లో సైలెంట్ అయిపోతే టీడీపీ ప్రచారం తగ్గిపోతుందని ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది.టీడీపీ మహిళా సానుభూతిపరులకు ఈ సమస్య కొద్దిరోజులుగా ఎదురవుతోంది.
మరోవైపు ఎన్నారై టీడీపీ ఉమెన్ లీడర్లను కూడా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు వదలడం లేదు. బ్రిటన్‌లో ఉన్న ఒక మహిళపై ఈ మధ్య సోషల్ మీడియా వార్ పోయింది. ఆమెపై ఏకంగా పత్రికల్లో వచ్చినట్లే మార్ఫింగ్ వార్తలు సృష్టించి పోస్ట్ లు పెడుతున్నారు.ఆమె వ్యక్తిత్వాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కూడా టార్గెట్ చేస్తూ ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారు. ఆమె ఫోన్ నంబర్‌కి అసభ్య మెసేజ్‌లు,బెదిరింపు మెసేజ్‌లు భారీగా పంపించారట. ఈ వ్యవహారం వెనుక కడప జిల్లాకు చెందిన ఓ వైసీపీ నేత కీలక పాత్ర వహించాడని టాక్ నడుస్తోంది.ఈ తరహా పోస్టులతో విసిగిపోయిన ఐటీడీపీ నేత ఏలూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైసీపీకి చెందిన కొందరు వ్యక్తుల పేర్లు కూడా ఆమె తన ఫిర్యాదులో ప్రస్తావించారు. టీడీపీ నేతలు ఫోన్లు చేసి బాధిత మహిళలకు ధైర్యం చెబుతున్నారు. ఎన్నికల ముందు ఇటువంటి బెదిరింపులు ఉంటాయని, భయపడవద్దని నచ్చచెబుతున్నారు.