ఏపీలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అత్యద్భుతంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. 2025లో కూడా ఎన్నో రకాల పనులను చేసింది. అటు అభివృద్ధిలో ముందడుగు వేస్తూ.. ఇంకోవైపు సంక్షేమాన్ని అస్సలు మరవలేదు. ఈ ఏడాదిలోనే ఇచ్చిన హామీ ప్రకారం ఆటో డ్రైవర్లకు రూ.436 కోట్లు విడుదల చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేసి పేద వారి కడుపు నింపారు. ఎస్సీ, మైనార్టీ, స్వర్ణకార కార్పొరేషన్లకు పెద్ద పీట వేశారు సీఎం చంద్రబాబు నాయుడు. అటు పాస్టర్లకు నెలకు రూ.5వేల గౌరవ వేతనం ఇస్తున్నారు. ఇంకోవైపు పురోహితుల వేతనాలు కూడా పెంచారు. అంతే కాకుండా మెగా డీఎస్సీలో 15941 పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు తీపి కబురు అందించారు ప్రభుత్వ పెద్దలు. ఇవే కాకుండా 5757 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేసింది కూటమి ప్రభుత్వం.
అటు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఆశాలకు గ్రాట్యుటీ అమలు చేస్తోంది కూటమి. అంతే కాకుండా బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు అందజేస్తున్నారు. స్త్రీ శక్తి, ఉచిత బస్సు, ఉచిత సిలిండర్ పథకాలను ఈ ఏడాదిలోనే ప్రారంభించారు అమలు చేశారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం కింద రూ.33 వేల కోట్లు కేటాయించారు. రోడ్ల మరమ్మతులకు రూ.1000 కోట్లు కేటాయించారు. తిరుమల ఆలయంలో సమూల మార్పులు. అత్యాధునికంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకోపక్క విద్యార్థుల కోసం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వం.
అంతే కాకుండా శరవేగంగా అమరావతి నిర్మాణ పనులు చేస్తున్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, అదానీ డేటా సెంటర్, టీసీఎస్ లాంటివి వచ్చాయి. ఇవన్నీ 2026లో పనులు మొదలు పెట్టాల్సి ఉంది. ఇలా ఎన్నో రకాల విజయాలను సాధించింది కూటమి ప్రభుత్వం. రాబోయే 2026లో కూడా అనేక పెద్ద టార్గెట్లను పెట్టుకుంది. అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేయడం, మరీ ముఖ్యంగా పోలవరం కంప్లీట్ చేయడం చంద్రబాబు టార్గెట్లలో ఉన్నాయి. మొత్తంగా గడిచిన 2025 సంవత్సరంలో అన్ని పనుల్లోనూ కూటమి ప్రభుత్వం టాప్ లోనే ఉందని అంటున్నారు ఏపీ ప్రజలు.