Nellore: నెల్లూరులో రసవత్తర రాజకీయాలు.. చర్చనీయాంశంగా అనిల్‌, కోటంరెడ్డి భేటీ..

Nellore: నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి.

Update: 2022-04-14 14:45 GMT

Nellore: నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఉప్పునిప్పుగా ఉన్న నేతలు నేటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఒక్కటి ఆవుతున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి పదవి చేపట్టిన నాటి నుండి నెల్లూరు జిల్లాలో శత్రువుకి శత్రువు మిత్రుడు అణా చందాన కలయికలు కాకపుటిస్తున్నాయి. మాజీ మంత్రి అనిల్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల కీలక భేటీ నెల్లూరు జిల్లాలో చర్చకు దారి తీస్తుంది.

మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు సజ్జాపురంలో భోజన సమయంలో ఓ నివాసంలో భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఇరువురి మధ్య భవిష్యత్ రాజకీయాలకు సంబంధించి చర్చలు జరిగినట్లు సమాచారం. మంత్రివర్గంలో తనకు స్థానం దక్కలేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఇటీవలే కన్నీళ్లు పెట్టుకున్నారు.. నియోజకవర్గంలోని మొత్తం నేతలు కూడా రాజీనామాకు సిద్ధమయ్యారు..

మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తనదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ కామెంట్స్‌ చేశారు. తాజాగా వీరిద్దరి భేటి నెల్లూరులో హీట్ పుట్టిస్తుంది ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుంది అన్న సందేహాలు జిల్లాలో చక్కర్లు కొడుతున్నాయి.

Tags:    

Similar News