Anna Canteens : ఏపీలో ప్రారంభమైన అన్నా క్యాంటీన్లు

Update: 2024-08-16 06:00 GMT

ఏపీలో అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభమయ్యాయి. గుడివాడలో మొదటి అన్నా క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరి స్వయంగా భోజనం వడ్డించారు. తర్వాత సీఎం దంపతులతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే భోజనం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి సామాన్యులకు అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. తొలి దశలో 100 అన్నా క్యాంటీన్లను మంత్రులు శుక్రవారం ప్రారంభిస్తారు. ఈ క్యాంటీన్ల ద్వారా లక్ష మంది పేదలకు ఆహారాన్ని అందించనున్నారు.

Tags:    

Similar News