AP Weather : ఏపీకి మరో తుఫాను గండం

Update: 2024-10-19 17:05 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. అది తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయంటోంది. ప్రస్తుతం ఉత్తర అండమాన్ పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, అది వాయువ్య దిశగా కదులుతూ 22 నాటికి అల్పపీడనంగా బలపడనున్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని వివరించింది.

Tags:    

Similar News