మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. సోషల్ వెల్ఫేర్ డీడీని ఫోన్లో తీవ్రస్థాయిలో బెదిరించారించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను చెప్పినా తాళ్లూరు బాబు అనే ఉద్యోగిని ఎందుకు బదిలీ చేయలేదంటూ ఆ ఆడియోలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బదిలీ చేయలేకపోతే... సెలవు పెట్టి వెళ్లాలని బెదిరింపులకు దిగారు.
మహిళా అధికారిని ఏకవచనంతో సంబోధించారు. ప్రస్తుతం ఈ ఆడియో వైరల్‌గా మారింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు. మంత్రులు.. ఇలా అధికారులపై బెదిరింపులకు పాల్పడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.