సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ అవినితీని నిరూపిస్తానంటూ సవాల్ చేసిన పల్లె రఘునాథ్‌రెడ్డి.. అక్కడి చేరుకునేందుకు ప్రయత్నించగా ఆయన్ను అదుపులో తీసుకున్నారు. అటు ఎమ్మెల్యే దిద్దుకుంట శ్రీధర్‌రెడ్డి సత్యమ్మ దేవాలయానికి చేరుకోవడంతో ఉద్రిక్త ఏర్పడింది. దేవాలయం ప్రాంగణంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు చెప్పులు విసురుకున్నారు. పోలీసుల సమక్షంలో... ఇరుపార్టీలకు చెందిన వాహనాలు ధ్వంసమయ్యాయి. టీడీపీ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారు పోలీసులు. ఇరువర్గాల మధ్య చెప్పులు, రాళ్ల దాడి జరిగింది. మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రశాంతతకు మారుపేరైనా పుట్టపరిస్థితి ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.
వైసీపీ, టీడీపీ నేతల సవాళ్ల నేపథ్యంలో.. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు.. పెద్ద సంఖ్యలో పుట్టపర్తి చేరుకున్నారు. చేరుకున్నారు. పోలీసులు ముందస్తుగా పుట్టపర్తిలో ఆంక్షలు విధించారు. నేతల ప్రమాణాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అయితే పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా.. అరెస్ట్ చేసినా.. సత్యమ్మ వద్ద ప్రమాణం చేస్తానని పల్లెరఘునాథరెడ్డి శపథం చేశారు.