టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమం పునఃప్రారంభం అవుతుంది. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. ఏలూరు, మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు రోజులపాటు చంద్రబాబు పర్యటించనున్నారు. 12న నూజివీడులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ప్రారంభించనున్న చంద్రబాబు.. రాత్రికి అక్కడే బస చేస్తారు. 13 మధ్యాహ్నం గుడివాడలో రోడ్ షో, బహిరంగ సభను నిర్వహించి.. రాత్రికి నిమ్మకూరులో బస చేస్తారు. 14న మచిలీపట్నంలో రోడ్ షో, బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు.
ఉమ్మడి కృష్ణ జిల్లాలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్న చంద్రబాబు.. ఏలూరు, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మూడు రోజుల పాటు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో రోడ్ షోలు, బహిరంగ సభలు, వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మూడు పర్యటనలకు సంబంధించిన ఏర్పాట్లను ఆయా ప్రాంతాల టీడీపీ నాయకులు ముమ్మరంగా చేస్తున్నారు. ఇప్పటికే చంద్ర బాబు పర్యటించనున్న ప్రాంతాల్లో పార్టీ జెండాలు, కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఏలూరు, మచిలీపట్నం పరిధిలో మూడు రోజుల పాటు కార్యక్రమాలు ఉండడంతో ఆ ప్రాంతాల్లోని పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో ఉన్నారు.