గన్నవరంలో రెవిన్యూ అధికారులు వింత పోకడలకు పోతున్నారు.టీడీపీ నేతల పొలాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టి చెరువు భూమి అంటూ సర్వే చేపడుతున్నారు.1998లో జాస్తి రాజేశ్వరమ్మకు డీ ఫామ్ పట్టా ఇచ్చారు అప్పటి రెవిన్యూ అధికారులు.ఆమె తన కుమారుడుకు వారసత్వంగా ఆస్తిగా ఆ పొలాన్ని ఇచ్చింది. అయితే 25 సంవత్సరాల తరువాత అది ప్రభుత్వ భూమి అంటూ టీడీపీ సానుభూతి పరుడైన వెంకటేశ్వరరావు పొలాల్లో అధికారులు బోర్డులు పెట్టారు. అలాగే గ్రామ సచివాలయంలో భూ సర్వే నమూన రికార్డ్ ప్రకారం అడంగల్ కాపీని కూడా ఇచ్చారు తహసీల్దార్. నిమ్మసాగు చేస్తున్న పొలాన్ని చెరువుభూమి అంటూ బోర్డులు పెట్టిన రెవిన్యూ తీరును తప్పుపడుతున్నారు గ్రామస్తులు.