AP : ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్‌పాయిజన్
ఆసుపత్రిలో బెడ్లు ఖాళీ లేకపోవడంతో.... ఒక్కొక్క బెడ్‌పై ఇద్దరిని పడుకొపెట్టి వైద్యం చేస్తున్నారు డాక్టర్లు;
ప్రకాశం జిల్లా దోర్నాలలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్‌పాయిజన్ జరిగింది. విషాహారం తినడంతో విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో మొత్తం 45మంది విద్యార్ధులు ఆసుపత్రి పాలయ్యారు. వీరంతా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆసుపత్రిలో బెడ్లు ఖాళీ లేకపోవడంతో.... ఒక్కొక్క బెడ్‌పై ఇద్దరిని పడుకొపెట్టి వైద్యం చేస్తున్నారు డాక్టర్లు.
సమాచారం తెలుసుకున్న మార్కాపురం జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, ఐటీడీఏ అధికారులు విద్యార్ధుల్ని పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. తమ పిల్లల ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు తల్లిదండ్రులు.