ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ ఉల్లంఘించిన వారిపై అధికారులు చర్యలు చేపట్టారు. ఇటీవల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలను ఉల్లంఘించిన విశాఖ జిల్లా ఆనందపురం మండల విద్యాశాఖ అధికారిణి పద్మావతి తీరుపై అధికారులు సీరియస్ అయ్యారు. పద్మావతిని సస్పెం డ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలను అనుసరించి ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహించాలని కలెక్టర్ మల్లికార్జున సూచించారు. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.