గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి నిరసన సెగ తప్పడం లేదు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులోని కొడవటికల్లు గ్రామంలో నందిగామ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావును స్థానికులు నిలదీశారు. సుబాబుల్ చెట్లకు మద్దతు ధర కల్పించకపోవడంతో ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో రైతులకు ఏం చెప్పాలో అర్థం కాక అక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. ఎన్నికలకు ముందు అమరావతికి మద్దతు తెలిపిన ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు.. అనంతరం మూడు రాజధానులకు మద్దతుగా పాదయాత్ర చేశారు. దీంతో ఎమ్మెల్యేపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.