AP: అధికారికంగా ఏపీ రాజధానిగా అమరావతి
అమరావతికి అధికారిక గెజిట్ ఈ పార్లమెంట్ భేటీలోనే బిల్లు.. న్యాయశాఖ పరిశీలనలో ఉన్న బిల్లు.. వెల్లడించిన కేంద్రమంత్రి పెమ్మసాని
అమరావతి రాజధాని విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమరావతిని అధికారికంగా రాష్ట్ర రాజధానిగా గుర్తించే గెజిట్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి రాజధాని బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రాజధాని విషయం చర్చించినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం హోం శాఖలో ఫైల్ క్లియర్ అయి, న్యాయశాఖ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
పార్లమెంట్ బిల్లు ద్వారా గెజిట్
అమరావతి అభివృద్ధి ప్రక్రియలో గెజిట్ ప్రచురణ కీలకం కానుంది. 2014లో CRDA ఏర్పాటు చేసిన తర్వాత, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రతిపాదించారు. కానీ 2019లో వైసీపీ ప్రభుత్వం ‘మూడు రాజధానులు’ విధానాన్ని ప్రవేశపెట్టి, CRDAను అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ ఏరియా గా మార్చింది. కానీ చట్టపరంగా నిలబడలేదు. అందుకే మరోసారి అలాంటి సమస్యలు రాకుండా గెజిట్ ప్రచురించేలా చూడాలని రైతులు కోరుతున్నారు. ఇన్వెస్టర్లు కోరుతున్నారు. గెజిట్ ప్రచురణతో రాజధానిని ఇక ఎవరూ మార్చలేరని పెట్టుబడిదారులు నమ్మకం పెంచుకుంటే పెట్టుబడులు పెరుగుతాయి. నగరం వేగంగా విస్తరిస్తుంది. గెజిట్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం కేంద్ర సహకారంపై ఆధారపడి ఉంది. 2020లో మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసిన హైకోర్టు ఆదేశాలు, సుప్రీంకోర్టు పెండింగ్ కేసులు ఇంకా పరిష్కారం కాకపోవడంతో, ఈ చర్యలు రాజకీయంగా సున్నితమైనవిగా మారుతాయి.
అన్నీ అనుకున్నట్లు జరిగితే...
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే శీతాకాల సమావేశాలలోనే అంటే డిసెంబర్ లోనే అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఖరారు చేస్తూ చట్టపరమైన రక్షణ కలిగేలా గెజిట్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా పార్లమెంట్ లో చట్టం చేయించి, గెజిట్ జారీ చేయించాలన్న రైతుల డిమాండ్ కు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. తెలుగుదేశం ప్రస్తుతం కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తూండటంతో ఈ మేరకు అమరాతి గెజిట్ విడుదల చేయించే విషయంలో ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదని అంటున్నారు.
కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
అమరావతి రాజధాని విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమరావతిని అధికారికంగా రాష్ట్ర రాజధానిగా గుర్తించే గెజిట్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి రాజధాని బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రాజధాని విషయం చర్చించినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం హోం శాఖలో ఫైల్ క్లియర్ అయి, న్యాయశాఖ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇక, రాజధాని నిర్మాణంలో భాగంగా రైతులకు భూవినిమయ ఒప్పందంలో 98 శాతం ప్లాట్ల పంపిణీ పూర్తైనట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మిగిలిన 2 శాతం సమస్యలు కూడా త్వరలో పరిష్కారం కానున్నాయని తెలిపారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా శాశ్వతంగా ప్రకటించేందుకు పార్లమెంట్ సాక్షిగా బిల్లు తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్లు వెల్లడించారు. దీనితో అమరావతి రాజధాని విషయంలో ఓపెన్ ఎండింగ్ లేకుండా శాసనపరంగా పూర్తి నిర్ధారణ కలిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, అమరావతి గెజిట్‌పై త్వరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో, రాజధాని ప్రాంతంలో తిరిగి కార్యకలాపాలు వేగం పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అమరావతి గెజిట్ అంశం వివాదాస్పదంగానే ఉంది. మొదటి ఐదేళ్లు గెజిట్ తీసుకురాలేదని గోల చేశారు. ఏ రాష్ట్రానికి గెజిట్ ఉండదు.