AP: యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ ఆమోదముద్ర

ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం... ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పన.. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల బీమా... 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా

Update: 2025-09-05 03:00 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ మం­త్రి­వ­ర్గం కీలక ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. యూ­ని­వ­ర్స­ల్‌ హె­ల్త్‌ పా­ల­సీ­కి ఏపీ కే­బి­నె­ట్‌ ఆమో­ద­ము­ద్ర వే­సిం­ది. ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్రం­లో­ని ప్ర­జ­లం­ద­రి­కీ ఆరో­గ్య బీమా కల్పి­స్తూ కే­బి­నె­ట్‌ ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. సచి­వా­ల­యం­లో సీఎం చం­ద్ర­బాబ అధ్య­క్ష­తన మం­త్రి­వ­ర్గ సమా­వే­శం కొ­న­సా­గు­తోం­ది. ఈ భే­టీ­లో పలు కీలక ని­ర్ణ­యా­ల­కు కే­బి­నె­ట్‌ ఆమో­దం తె­లి­పిం­ది. ఆయు­ష్మా­న్‌ భా­ర­త్‌-ఎన్టీ­ఆ­ర్‌ వై­ద్య­సే­వా పథకం కింద యూ­ని­వ­ర్స­ల్‌ హె­ల్త్‌ పా­ల­సీ­కి మం­త్రి­వ­ర్గం గ్రీ­న్‌­సి­గ్న­ల్‌ ఇచ్చిం­ది. దీని ద్వా­రా ఒక్కో కు­టుం­బా­ని­కి ఏడా­ది­కి రూ.25లక్షల వరకూ ఉచిత చి­కి­త్స­లు అం­దే­లా కొ­త్త వి­ధా­నా­ని­కి ఆమో­ద­ము­ద్ర వే­సిం­ది. ఆర్థిక స్థి­తి­గ­తు­ల­తో సం­బం­ధం లే­కుం­డా అం­ద­రి­కీ హె­ల్త్‌ పా­ల­సీ అమ­ల­య్యే­లా ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. రా­ష్ట్రం­లో­ని 1.63 కో­ట్ల కు­టుం­బా­ల­కు ఆరో­గ్య బీమా అం­దే­లా ప్ర­భు­త్వం కా­ర్యా­చ­రణ రూ­పొం­దిం­చిం­ది. ము­ఖ్య­మం­త్రి నారా చం­ద్ర­బా­బు నా­యు­డు అధ్య­క్షన జరి­గిన సమా­వే­శం­లో.. పలు కీలక ని­ర్ణ­యా­ల­కు ఆమో­దం తె­లి­పిం­ది.. రా­ష్ట్రం­లో పౌ­రు­లం­ద­రి­కీ ఆరో­గ్య ధీ­మా­ను కల్పి­స్తూ కే­బి­నె­ట్ ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. ఆయు­ష్మా­న్ భా­ర­త్ – ఎన్టీ­ఆ­ర్ వై­ద్య సేవా పథకం కింద యూ­ని­వ­ర్స­ల్ హె­ల్త్ పా­ల­సీ­కి ఆమో­దం తె­లి­పిం­ది.ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ అమలు అయ్యేలా నిర్ణయించింది. ఈ విధానం ద్వారా 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందేలా కార్యాచరణ రూపొందించింది.

ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రీడ్ పాలసీ

493 నె­ట్వ­ర్క్ ఆస్ప­త్రు­ల్లో ఉచి­తం­గా వై­ద్య సే­వ­లు పొం­దే­లా ఎన్టీ­ఆ­ర్ వై­ద్య సేవ హై­బ్రీ­డ్ వి­ధా­నం అమలు చే­య­ను­న్నా­రు.. మొ­త్తం 3,257 చి­కి­త్స­ల­ను హై­బ్రీ­డ్ వి­ధా­నం­లో ఉచి­తం­గా అం­దిం­చ­నుం­ది రా­ష్ట్ర ప్ర­భు­త్వం.. కే­వ­లం ఆరు గం­ట­ల్లో­నే వై­ద్య చి­కి­త్స­ల­కు అను­మ­తు­లు ఇచ్చే­లా ప్రీ ఆథ­రై­జే­ష­న్ మే­నే­జ్మెం­ట్ ఏర్పా­టు చే­య­నుం­ది.. రూ.2.5 లక్షల లోపు వై­ద్య చి­కి­త్సల క్లె­యి­మ్‌ ఇన్సూ­రె­న్సు కం­పె­నీ పరి­ధి­లో­కి వచ్చే­లా కొ­త్త వి­ధా­నం ఉం­టుం­ది.

10 వైద్య కళాశాలలకు ఆమోదం

కొత్త వైద్యశాలల విషయంలోనూ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పీపీపీ విధానంలో రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రెండు దశల్లో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు. ఆర్ఎఫ్‌పీ జారీకి కేబినెట్ అనుమతి ఇచ్చింది.

Tags:    

Similar News