AP: కీలక ప్రతిపాదనలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం

మంత్రులు, ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేసిన సీఎం

Update: 2025-11-10 10:51 GMT

ఏపీ ప్ర­భు­త్వం కీలక ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. సీఎం చం­ద్ర­బా­బు అధ్య­క్ష­తన జరి­గిన మం­త్రుల సమా­వే­శం­లో 70 అజెం­డా అం­శా­ల­పై చర్చ జర­గ­గా వీ­టి­కి ఏక­గ్రీ­వం­గా ఆమో­దం తె­లి­పిం­ది. రా­జ­ధా­ని అభి­వృ­ద్ధి­లో భా­గం­గా పలు సం­స్థ­ల­కు భూ­ము­లు కే­టా­యిం­పు­తో పాటు రా­యి­తీ­లు ఇచ్చేం­దు­కు మం­త్రు­లు ఆమో­దం తె­లి­పా­రు. అలా­గే అమ­రా­వ­తి­లో క్వాం­ట­మ్ కం­ప్యూ­టిం­గ్ వ్య­వ­స్థ ఏర్పా­టు­కు గ్రీ­న్ సి­గ్న­ల్ ఇచ్చా­రు. రె­వె­న్యూ శా­ఖ­లో పో­స్టుల భర్తీ­కి కే­బి­నె­ట్ ఆమో­దం తె­లి­పిం­ది. కే­బి­నె­ట్ భే­టీ­లో సీఎం చం­ద్ర­బా­బు మా­ట్లా­డు­తూ పే­ద­ల­కు ఇళ్ల మం­జూ­రు వి­ష­యం­లో బా­ధ్యత తీ­సు­కో­వా­ల­న్నా­రు. ని­వాస స్థ­లం లేని వారి జా­బి­తా సి­ద్ధం చే­యా­ల­ని సూ­చిం­చా­రు. రె­వె­న్యూ సమ­స్యల పరి­ష్కా­రం­లో జా­ప్యం తగ­ద­ని పే­ర్కొ­న్నా­రు. అజెం­డా­పై చర్చిం­చిన తర్వాత వి­విధ అం­శా­ల­పై మం­త్రు­ల­తో సీఎం మా­ట్లా­డా­రు. మొం­థా తు­పా­ను సమ­యం­లో ప్ర­తి ఒక్క­రూ క్షే­త్ర­స్థా­యి­లో ఉండి ప్ర­జ­ల­కు తక్ష­ణ­సా­యం అం­దే­లా చే­శా­ర­ని అభి­నం­దిం­చా­రు. అధి­కా­రు­ల­తో సమ­న్వ­యం­తో­నే సహా­యక చర్య­లు వే­గం­గా అం­దా­య­ని చె­ప్పా­రు.

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ము­ఖ్య­మం­త్రి నారా చం­ద్ర­బా­బు నా­యు­డు 48 మంది ఎమ్మె­ల్యేల పని­తీ­రు­పై మం­త్ర­వ­ర్గ సమా­వే­శం­లో మరో­సా­రి ప్ర­స్తా­విం­చా­రు. ఆ ఎమ్మె­ల్యేల వి­ష­యం­లో జి­ల్లా ఇన్‌­చా­ర్జ్ మం­త్రు­లు బా­ధ్య­త­లు పూ­ర్తి­గా తీ­సు­కో­వా­ల­న్నా­రు. ఆ ఎమ్మె­ల్యే­లు పా­ర్టీ కా­ర్య­క్ర­మా­ల్లో పా­ల్గొ­న­డం లేదు. పె­న్ష­న్లు పం­పి­ణీ చే­య­డం, సీ­ఎం­ఆ­ర్ఎ­ఫ్ చె­క్కు­లు ఇవ్వ­క­పో­వ­డం వం­టి­వి చే­స్తు­న్నా­రు. అలాం­టి వా­రి­పై చం­ద్ర­బా­బు అస­హ­నం­తో ఉన్నా­రు. కే­బి­నె­ట్ లో ఎజెం­డా­పై చర్చ తర్వాత మం­త్రు­ల­తో చం­ద్ర­బా­బు ప్ర­త్యే­కం­గా చర్చిం­చా­రు. వై­జా­గ్ సమి­ట్ పై దృ­ష్టి పె­ట్టా­ల­ని మం­త్రు­ల­కు సూ­చిం­చా­రు. ప్ర­తి­ష్టా­త్మ­కం­గా తీ­స్కు­ని పని చె­య్యా­ల­న్నా­రు. పె­ద్ది­రె­డ్డి ఆక్ర­మ­ణ­ల­పై పూ­ర్తి సా­క్ష్యా­ల­తో వీ­డి­యో­లు తీ­యిం­చా­న­ని కే­బి­నె­ట్‌ సమా­వే­శం­లో పవ­న్‌ కల్యా­ణ్‌ చె­ప్పా­రు. ఈ సం­ద­ర్భం­గా పవ­న్‌ పని­తీ­రు­ను సీ­ఎం­తో­పా­టు సహచర మం­త్రు­లు ప్ర­శం­సిం­చా­రు. ఎర్ర చం­ద­నం డిపో సం­ద­ర్శ­న­పై తన అను­భ­వా­ల­ను పవ­న్‌ కే­బి­నె­ట్‌ భే­టీ­లో పం­చు­కు­న్నా­రు. పట్టు­బ­డిన ఎర్ర­చం­ద­నం­తో పరి­క­రా­లు తయా­రు చే­యిం­చి వి­క్ర­యిం­చే ప్ర­తి­పా­ద­న­ల­ను పరి­శీ­లిం­చా­ల­ని సీఎం చం­ద్ర­బా­బు సూ­చిం­చా­రు.

Tags:    

Similar News