AP: నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Update: 2025-09-18 03:00 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ శా­స­న­సభ సమా­వే­శా­లు నేటి నుం­చి ప్రా­రం­భం కా­ను­న్నా­యి. ఉదయం 9:00 గం­ట­ల­కు శా­స­న­సభ, 10:00 గం­ట­ల­కు శాసన మం­డ­లి సమా­వే­శా­లు మొ­ద­ల­వు­తా­యి. శాసన సభ సమా­వే­శా­లు ప్రా­రం­భం సం­ద­ర్భం­గా స్పీ­క­ర్ అయ్య­న్న­పా­త్రు­డు ఉన్న­త­స్థా­యి సమీ­క్ష ని­ర్వ­హిం­చా­రు. ఈ సమా­వే­శా­ని­కి చీఫ్ సె­క్ర­ట­రీ, డీ­జీ­పీ­తో పాటు ఇతర కీలక అధి­కా­రు­లు హా­జ­ర­య్యా­రు. అసెం­బ్లీ సమా­వే­శా­ల­కు పటి­ష్ట భద్ర­త­పై చర్చిం­చా­రు. ఇవాళ ఉభయ సభలు ప్ర­శ్నో­త్త­రా­ల­తో ప్రా­రం­భం కా­ను­న్నా­యి. ప్ర­జ­ల­కు సం­బం­ధిం­చిన కీలక అం­శా­ల­పై సభ్యు­లు ప్ర­శ్న­లు వే­స్తా­రు. ప్ర­శ్నో­త్త­రాల అనం­త­రం శా­స­న­సభ వ్య­వ­హా­రాల సలహా కమి­టీ­స­మా­వే­శ­మ­వు­తుం­ది. ఈ సమా­వే­శం­లో వర్షా­కాల సమా­వే­శా­ల­ను ఎన్ని రో­జు­లు ని­ర్వ­హిం­చా­ల­న్న దా­ని­పై ని­ర్ణ­యం తీ­సు­కో­ను­న్నా­రు. దా­దా­పు 10 నుం­చి 15 రో­జుల పాటు ని­ర్వ­హిం­చే అవ­కా­శ­ము­న్న­ట్లు సమా­చా­రం. ప్ర­భు­త్వం ఏడా­ది పా­ల­న­పై అసెం­బ్లీ సమా­వే­శా­ల్లో చర్చ జరి­గే అవ­కా­శ­ముం­ది. ఇటీ­వల రా­ష్ట్రం­లో వచ్చిన వర­ద­లు, వర్షా­ల­కు జరి­గిన నష్టం, తది­తర అం­శా­ల­పై పవ­ర్‌­పా­యిం­ట్ ప్ర­జెం­టే­ష­న్లు కూడా ఇవ్వ­ను­న్న­ట్లు తె­లు­స్తోం­ది. తాజా రా­జ­కీయ పరి­ణా­మా­లు, ప్ర­భు­త్వ పథ­కాల అమ­లు­పై అసెం­బ్లీ­లో ప్ర­త్యేక చర్చ­లు జర­గ­ను­న్నా­యి. వై­ఎ­స్ఆ­ర్‌­సీ­పీ సభ్యు­లు ఈ సమా­వే­శా­ని­కి హా­జ­ర­య్యే అవ­కా­శం కని­పిం­చ­డం లేదు. జగన్ కు ప్ర­తి­ప­క్ష నేత హోదా ఇవ్వ­క­పో­తే తాము వచ్చే­ది లే­ద­ని ఇప్ప­టి­కే తే­ల్చే­శా­రు. అయి­తే వరు­స­గా అరవై రో­జుల పాటు సభకు రా­క­పో­తే అన­ర్హ­తా వేటు వేసే అధి­కా­రం సభకు ఉంది. ఈ నే­ప­థ్యం­లో వై­సీ­పీ సభ్యు­లు ఏ ని­ర్ణ­యం తీ­సు­కుం­టా­రో చూ­డా­లి.

Tags:    

Similar News