ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ జీవోను జారీ చేసింది. ‘భిక్షాటన నివారణ (సవరణ) చట్టం– 2025’ అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ కొత్త ఈ చట్టం అమలుతో ఇకపై రాష్ట్రంలో ఎవరూ భిక్షాటన చేయకూడదు. ఈ నెల 15న చట్టానికి గవర్నర్ ఆమోదముద్ర వేయగా.. ఈనెల 27న జీవోను విడుదల చేశారు. ఈ మరకు న్యాయశాఖ సెక్రటరీ గొట్టాపు ప్రతిభా దేవి జీవో ఎంఎస్ నంబర్ 58ను విడుదల చేశారు. ఈ ‘భిక్షాటన నివారణ (సవరణ) చట్టం– 2025’ ను సంక్షేమ, పోలీసు శాఖ సమన్వయంతో అమలు చేస్తారు. రాష్ట్రంలో భిక్షాటన మాఫియాకు అడ్డుకట్ట వేయడంతో పాటుగా.. వ్యవస్థీకృత భిక్షాటనను పూర్తిగా నిర్మూలించాలని నిర్ణయం తీసుకున్నారు. నిరుపేదలకు పునరావాసం కల్పించాలన్న లక్ష్యంతో చట్టాన్ని అమలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు యాచకులకు సహాయం చేస్తూ ఉపాధి కల్పిస్తోంది.. వారు భిక్షాటన వైపు వెళ్లకుండా అవసరమైన చర్యలు తీసుకుంటోంది. యాచకుల్ని శిక్షించబోమని వారిికి జీవనోపాధి కల్పిస్తామని చెప్పింది.
రాష్ట్ర పండుగగా సీపీ బ్రౌన్ జయంతి
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు భాష ఉన్నతికి ఎనలేని కృషి చేసిన సీపీ బ్రౌన్ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఏటా నవంబర్ 10న బ్రౌన్ జయంతిని నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు వచ్చే నెల 23న పుట్టపర్తిలో నిర్వహించే సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర పర్యాటక సంస్థ ఇందుకోసం పంపిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని రూ.10 కోట్లు నిధులు కేటాయించారు. దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానుండంతో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు రూ.10 కోట్లు జారీ చేయడంపై పిల్ దాఖలు చేయగా హైకోర్టు కొట్టేసింది.