AP: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Update: 2025-03-10 06:00 GMT

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎనిమిదో రోజు ప్రారంభమయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా విజయం సాధించడంతో అసెంబ్లీ శుభాకాంక్షలు తెలిపింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా స్ఫూర్తిదాయకమైన ఆటతీరు ప్రదర్శించారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశంసించారు. 2025-2026 వార్షిక బడ్జెట్​పై చర్చ జరగుతోంది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిస్తున్నారు. పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధిపై సభలో చర్చిస్తున్నారు. సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్ కమ్యునికేషన్ శాఖలు, రాష్ట్రంలో నూతన వైద్య కళాశాలలు, ఎన్టీఆర్ వైద్య సేవల అంశంపై చర్చలు జరుపుతున్నారు. శుక్రవారం నాడు విశాఖ‌లో టీడీఆర్ బాండ్ల అక్రమాల‌పై అసెంబ్లీలో చర్చ జరిగింది. వీటిపై విజిలెన్స్, సీఐడీ విచార‌ణ జ‌రుగుతుందని మంత్రి నారాయణ వెల్లడించారు. నివేదిక రాగానే బాధ్యుల‌పై చ‌ర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుప‌తిలో రూ.170.99 కోట్ల‌కు 29 బాండ్లు జారీ చేసినట్లు వివరించారు. గ‌త ప్రభుత్వంలో అక్రమాలు జ‌ర‌గ‌డంతో తమ సర్కార్ వ‌చ్చిన త‌ర్వాత ఐదు నెల‌ల పాటు బాండ్ల జారీని నిలిపివేశామన్నారు.


Tags:    

Similar News