సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 7న సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తమ ప్రతిపాదనలను ఈ నెల 5లోగా పంపాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నందున కీలక పథకాలు, ప్రాజెక్టుల అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, ఆర్థిక వ్యయాన్ని సమీక్షించి కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందట. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తమ ప్రతిపాదనలను మార్చి 5లోగా పంపించాలని సీఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మార్చి నెల చివరి నాటికి నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మహానాడు నాటికి పార్టీ కమిటీల పూర్తవుతుందన్నారు. టీడీపీఎల్పీ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు… పార్టీ కోసం పని చేసేవారినే నామినేటెడ్ పోస్టులకు రికమండ్ చేయాలని స్పష్టం చేశారు.