AP Cabinet Meeting : నేడు క్యాబినెట్ భేటీ

Update: 2025-04-15 09:00 GMT

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ క్యాబినెట్ భేటీ జరగనుంది. వెలగపూడి సచివాలయంలోని ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతి, సీఆర్డీఏ, నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణాలకు అవసరమైన నిధుల సమీకరణపై చర్చిస్తారని సమాచారం. అలాగే సీఆర్డీఏ 46వ అథారిటీలో ఆమోదించిన అంశాలన్నిటికీ మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది.

కొత్తగా రూ.30,667 కోట్లు పెట్టుబడులు, 32,133 ఉద్యోగాలు వ‌చ్చే ప్ర‌తిపాద‌న‌ల‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. విశాఖపట్నంలో టీసీఎస్ కంపెనీ ఏర్పాటుతో సహా పలు కంపెనీల పెట్టుబడులకు మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది. ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూకేటాయింపులకు అమోదించనుంది. ఉండవల్లి, పెనుమాక రైతులకు జరీబు భూములకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చే అంశంపై అథారిటీ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదించనుంది. ఏపీ మంత్రి మండలి సమావేశంలో కుప్పం నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. నెల్లూరులో ఏపీఐఐసీకి, విజయనగరం జిల్లాలో గ్రే హౌండ్స్‌కు గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు కేబినెట్‌లో భూములను కేటాయిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముందుగా నాలా ఫీజు రద్దు అంశాన్ని కేబినెట్‌లో ఈసారి ఉంచాలని మంత్రి మండలి భావించింది. అయితే ఆ శాఖను చూసే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా బదిలీ కావడంతో ఈ సారి కేబినెట్‌లో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉండకపోవచ్చని సమాచారం.

Tags:    

Similar News