AP CABINET: ప్రజా ప్రతినిధులూ..మీరే ఇలా చేస్తే ఎలా.?

టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్... అడ్డగోలుగా వ్యవహరిస్తే కఠిన చర్యలేనన్న సీఎం... కేబినెట్ సమావేశంలో క్లాస్ తీసుకున్న చంద్రబాబు;

Update: 2025-08-22 02:45 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో గత కొ­న్ని రో­జు­లు­గా.. కొం­త­మం­ది ఎమ్మె­ల్యేల తీరు తీ­వ్ర దు­మా­రం రే­పు­తోం­ది. శ్రీ­శై­లం ఎమ్మె­ల్యే బు­డ్డా రా­జ­శే­ఖ­ర్ రె­డ్డి, ఆయన అను­చ­రు­లు.. అటవీ సి­బ్బం­ది­పై దాడి చే­సి­న­ట్లు ఆరో­ప­ణ­లు వె­ల్లు­వె­త్తా­యి. ఇక ప్రి­న్సి­ప­ల్‌­ను వే­ధిం­చా­ర­న్న ఆరో­ప­ణ­లు ఆమ­దా­ల­వ­లస ఎమ్మె­ల్యే కూన రవి­కు­మా­ర్ , గుం­టూ­రు ఈస్ట్ ఎమ్మె­ల్యే నసీ­ర్ అహ్మ­ద్ వ్య­వ­హా­రం, అనం­త­పు­రం ఎమ్మె­ల్యే దగ్గు­పా­టి ప్ర­సా­ద్ సహా పలు­వు­రు ఎమ్మె­ల్యేల తీరు ఇటీ­వల.. రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా తీ­వ్ర చర్చ­కు దా­రి­తీ­య­డం­తో.. ఇలాం­టి ఘట­న­ల­పై ము­ఖ్య­మం­త్రి నారా చం­ద్ర­బా­బు నా­యు­డు తీ­వ్రం­గా స్పం­దిం­చా­రు. అమ­రా­వ­తి­లో ని­ర్వ­హిం­చిన ఏపీ మం­త్రి­వ­ర్గ సమా­వే­శం తర్వాత ప్ర­స్తుత రా­జ­కీయ పరి­స్థి­తుల గు­రిం­చి మం­త్రు­ల­తో మా­ట్లా­డిన సీఎం చం­ద్ర­బా­బు.. ఎమ్మె­ల్యేల పని­తీ­రు­పై తీ­వ్ర అస­హ­నం వ్య­క్తం చే­శా­రు.

సహించేదే లేదు: చంద్రబాబు

మం­త్రు­లు, ఎమ్మె­ల్యే­ల­కూ చం­ద్ర­బా­బు గట్టి వా­ర్నిం­గ్ ఇచ్చా­రు. నే­త­లు ఇష్టం వచ్చి­న­ట్టు ప్ర­వ­ర్తి­స్తే ఉపే­క్షిం­చే­ది లే­ద­న్నా­రు..ఎమ్మె­ల్యే­లు అడ్డ­గో­లు­గా వ్య­వ­హ­రి­స్తే ఎవరు బా­ధ్యత వహి­స్తా­ర­ని ప్ర­శ్నిం­చా­రు. అం­ద­రూ జా­గ్ర­త్త­గా ఉం­డా­ల­ని హె­చ్చ­రిం­చా­రు. జరు­గు­తు­న్న సం­ఘ­ట­న­ల­కు సం­బం­ధిం­చి ప్ర­ధా­నం­గా సీఎం వి­వ­రిం­చా­రు.. ఎమ్మె­ల్యే­లు అన­వ­సర వి­ష­యా­ల్లో జో­క్యం చే­సు­కుం­టే అన­వ­సర ఇబ్బం­దు­లు తప్ప­వ­న్నా­రు. ఫై­ళ్ల క్లి­య­రె­న్స్‌­కు సం­బం­ధిం­చి కూడా మం­త్రు­ల­పై చం­ద్ర­బా­బు అసం­తృ­ప్తి వ్య­క్తం చే­శా­రు. కొం­త­మం­ది మం­త్రు­లు, అధి­కా­రు­లు ఫై­ల్స్ క్లి­య­రె­న్స్ కు ఎక్కువ సమయం తీ­సు­కుం­టు­న్నా­ర­ని ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు. మం­త్రుల పె­ర్ఫా­మె­న్స్ పై వచ్చే కే­బి­నె­ట్‌­లో చర్చి­స్తా­మ­ని వె­ల్ల­డిం­చా­రు.

 కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు అధ్య­క్ష­తన జరి­గిన కే­బి­నె­ట్‌ సమా­వే­శం­లో కీలక ని­ర్ణ­యా­లు తీ­సు­కు­న్నా­రు.. మొ­త్తం 33 అజెం­డా అం­శా­ల­కు మం­త్రి­వ­ర్గం ఆమో­దం తె­లి­పిం­ది.. జల­వ­న­రు­ల­శాఖ పను­ల­కు సం­బం­ధిం­చి మరో 11 అం­శా­ల­కు కూడా గ్రీ­న్‌ సి­గ్న­ల్ ఇచ్చిం­ది మం­త్రి­వ­ర్గం.. ఏపీ సర్క్యు­ల­ర్ ఎకా­న­మీ, వే­స్ట్ రీ­సై­క్లిం­గ్ పా­ల­సీ (4.0) 2025-30కి ఆమో­దం తె­ల­ప­గా.. పర్యా­టక ప్రా­జె­క్టు­ల­కు ప్ర­భు­త్వ భూ­ముల కే­టా­యిం­పు మా­ర్గ­ద­ర్శ­కా­ల­కు ఆమో­ద­ము­ద్ర వే­సిం­ది.. అధి­కా­రిక భాష కమి­ష­న్ పేరు మా­ర్పు­న­కు కే­బి­నె­ట్ గ్రీ­న్‌ సి­గ్న­ల్ ఇచ్చిం­ది.. ‘మం­డ­లి వెం­కట కృ­ష్ణా­రా­వు అధి­కా­రిక భాష సంఘం….’గా మా­ర్పు­న­కు ఆమో­ద­ము­ద్ర పడిం­ది. సా­గు­భూ­మి­ని వ్య­వ­సా­యే­త­రం­గా మా­ర్పు­న­కు నాలా చట్ట సవ­ర­ణ­ల­కు ఆమో­దం తె­లి­పిం­ది కే­బి­నె­ట్‌.. 51వ సీ­ఆ­ర్డీఏ సమా­వే­శం ప్ర­తి­పా­ద­న­ల­కు కే­బి­నె­ట్ ఆమో­దం తె­లి­పిం­ది.. రా­జ­ధా­ని పరి­ధి 29 గ్రా­మా­ల్లో రూ.904 కో­ట్ల­తో మౌ­లిక వస­తుల కల్ప­న­కు కూడా గ్రీ­న్ సి­గ్న­ల్ ఇచ్చిం­ది.. సీ­ఆ­ర్డీఏ పరి­ధి­లో సం­స్థ­ల­కు భూ­కే­టా­యిం­పు­న­కు ఆమో­దం లభిం­చ­గా.. మం­త్రి వర్గ ఉప­సం­ఘం సి­ఫా­ర్సు­ల­కు కే­బి­నె­ట్ ఆమో­దం తె­లి­పిం­ది.

Tags:    

Similar News