CBN: తుంగభద్రపై చంద్రబాబు కీలక ఆదేశాలు

తక్షణం ప్రాజెక్టు వద్దకు డిజైన్‌ టీమ్‌ను పంపాలని సీఎం ఆదేశం.. లోతట్టు ప్రాంతాలను హెచ్చరించాలని ఆదేశం;

Update: 2024-08-12 02:00 GMT

తుంగభద్ర డ్యామ్‌ గేటు కొట్టుకుపోవడంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబువాయుడు ఆరా తీశారు. ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. తక్షణం ప్రాజెక్టు వద్దకు డిజైన్‌ టీమ్‌ను పంపాలని సీఎం సూచించారు. జలాశయంలో 6 మీటర్ల ఎత్తు వరకు నీరు ఉందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. స్టాప్‌లాక్‌ అరేంజ్‌మెంట్‌ ద్వారా నీరు వృథా కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.



 60టీఎంసీల నీరు పోయాకే...

వరద ఉద్ధృతికి పుల్లింగ్ చైన్ తెగిపోయి కొట్టుకుపోయిన 19వ నంబరు గేటుకు మరమ్మతులు ప్రారంభమయ్యాయి. కొట్టుకుపోయిన గేటుపై భారం పడకుండా మరో 7 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 8 గేట్ల నుంచి లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోతోంది. ఐరన్‌ షీట్ల ద్వారా నీటి వృథాను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రాజెక్టులో 60 టీఎంసీలు ఖాళీ చేశాక కొత్తగేటు ఏర్పాటు చేసే అవకాశముంది.

శనివారం రాత్రి నుంచి సుమారు 75వేల క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు పోతోంది. ఇదే విధంగా వెళితే రోజుకు 9 టీఎంసీల నీరు వృథా అవుతుంది. కొట్టుకుపోయిన గేటుపై భారం పడకుండా మరో 7 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కొట్టుకుపోయిన గేటు సహా 8 గేట్ల నుంచి లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోతోంది. మరో వైపు నిపుణుల బృందం డ్యామ్‌ వద్దకు చేరుకుంది. ఐరన్‌ షీట్ల ద్వారా నీటి వృథాను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రాజెక్టులో 60 టీఎంసీలు ఖాళీ చేశాకే కొత్తగేటు ఏర్పాటు చేయడానికి వీలుపడుతుందని భావిస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణకు ఏపీ వాటా 35శాతం ఉండగా.. డ్యామ్‌ నిర్వహణకు గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. తుంగభద్ర నుంచి సుంకేసుల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. గేటు మరమ్మతులు చేసే వరకు సుంకేసులకు వరద ప్రవాహం కొనసాగనుంది.

Tags:    

Similar News