AP: ఏపీ తలరాతను మార్చే సదస్సు నేటి నుంచే

భాగస్వామ్య సదస్సుకు విశాఖ సిద్ధం

Update: 2025-11-14 03:30 GMT

సీ­ఐ­ఐ­తో కలి­సి ఏపీ ప్ర­భు­త్వం ని­ర్వ­హి­స్తు­న్న భా­గ­స్వా­మ్య సద­స్సు శు­క్ర, శని­వా­రా­లు జర­గ­ను­న్న­ది. ప్ర­భు­త్వం ఎంతో ప్ర­తి­ష్టా­త్మ­కం­గా ని­ర్వ­హి­స్తు­న్న సద­స్సు­లో పా­ల్గొ­నేం­దు­కు దేశ, వి­దే­శాల ప్ర­తి­ని­ధు­లు గు­రు­వా­ర­మే నగ­రా­ని­కి చే­రు­కు­న్నా­రు. నగ­రం­లో ఎటు చూ­సి­నా భా­గ­స్వా­మ్య సద­స్సు కో­లా­హ­లం కని­పి­స్తోం­ది. సద­స్సు­కు ముం­దు ఒక­రో­జు ముం­దు నో­వా­టె­ల్‌ వే­ది­క­లో 35 ఒప్పం­దా­లు జరి­గా­యి. ము­ఖ్య­మం­త్రి నారా చం­ద్ర­బా­బు­నా­యు­డు సమ­క్షం­లో మొ­త్తం రూ.3.65 లక్షల కో­ట్లు పె­ట్టు­బ­డు­ల­కు ఒప్పం­దా­ల­పై సం­త­కా­లు చే­శా­రు. వీ­టి­లో రూ.2.65 లక్షల కో­ట్లు కే­వ­లం ఇంధన రం­గం­లో­ని­వే. వీటి ద్వా­రా 1.26 లక్షల మం­ది­కి ఉపా­ధి అవ­కా­శా­లు లభి­స్తా­యి. రెండ ురో­జుల సద­స్సు జరి­గే ఏయూ ఇం­జ­నీ­రిం­గ్‌ కళా­శాల మై­దా­నా­న్ని సర్వాంగ సుం­ద­రం­గా తీ­ర్చి­ది­ద్దా­రు. మొ­త్తం ఎని­మి­ది హా­ళ్లు ఏర్పా­ట్లు­చే­శా­రు. హాలు-5లో ప్ర­ధాన వే­ది­క­పై ప్రా­రం­భో­త్సవ కా­ర్య­క్ర­మం జర­గ­ను­న్న­ది. సద­స్సు­కు సు­మా­రు 2,500 మంది ప్ర­తి­ని­ధు­లు హా­జ­ర­వు­తా­రు. అతి­థు­ల­కు 700 కా­ర్లు వి­ని­యో­గి­స్తు­న్నా­రు. ఎయి­ర్‌­పో­ర్టు నుం­చి హో­ట­ళ్ల వరకు వా­రి­ని తీ­సు­కు­రా­వ­డా­ని­కి 14 బస్సు­లు ఏర్పా­టు­చే­శా­రు. 1,200 గదు­ల­ను ముం­దు­గా­నే సి­ద్ధం చే­శా­రు.

ఏపీకి మరో భారీ పెట్టుబడి

ఏపీ­కి మరో భారీ పె­ట్టు­బ­డి రా­నుం­ది. రె­న్యూ పవ­ర్‌ సం­స్థ రూ.82వేల కో­ట్ల పె­ట్టు­బ­డు­లు పె­ట్ట­నుం­ది. ఈ మే­ర­కు మం­త్రి నారా లో­కే­శ్‌ ‘ఎక్స్‌’ ద్వా­రా వె­ల్ల­డిం­చా­రు. ఐదే­ళ్ల తర్వాత మళ్లీ రా­ష్ట్రం­లో రె­న్యూ పవ­ర్‌ సం­స్థ అడు­గు­పె­ట్ట­నుం­ది. సో­లా­ర్‌ ఇం­గా­ట్‌, వా­ఫ­ర్‌ తయా­రీ, గ్రీ­న్‌ హై­డ్రో­జ­న్‌& గ్రీ­న్‌ మా­లి­క్యూ­ల్స్‌ ఉత్ప­త్తి రం­గా­ల్లో రె­న్యూ పవ­ర్‌ పూ­ర్తి­స్థా­యి పె­ట్టు­బ­డు­లు పె­డు­తుం­డ­టం గర్వం­గా ఉం­ద­ని లో­కే­శ్‌ పే­ర్కొ­న్నా­రు.  అనం­త­పు­రం జి­ల్లా­లో రూ.22వేల కో­ట్ల పె­ట్టు­బ­డి పె­ట్టేం­దు­కు వచ్చిన ఈ కం­పె­నీ.. 2019లో నాటి ము­ఖ్య­మం­త్రి జగ­న్‌ ని­ర్వా­కం­తో తి­రి­గి వె­ళ్లి­పో­యిం­ది. పీ­పీ­ఏల రద్దు­తో­పా­టు పు­నః­స­మీ­క్ష చే­ప­ట్టిన గత ప్ర­భు­త్వ వి­ధా­నా­ల­ను ఆ సం­స్థ తీ­వ్రం­గా వి­భే­దిం­చిం­ది. ఎన్డీ­యే కూ­ట­మి అధి­కా­రం­లో ఉం­డ­టం­తో రా­ష్ట్రా­ని­కి తి­రి­గి వచ్చిం­ది.

ఇవాళ భారీ ప్రకటన

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో పా­రి­శ్రా­మిక, రా­జ­కీయ వర్గా­ల్లో రా­ష్ట్ర ఐటీ, వి­ద్యా శాఖ మం­త్రి నారా లో­కే­శ్ చే­సిన ట్వీ­ట్ తీ­వ్ర ఉత్కంఠ రే­పు­తోం­ది. రా­ష్ట్రం­లో­కి ఓ భారీ అం­త­ర్జా­తీయ సం­స్థ పె­ట్టు­బ­డు­ల­తో అడు­గు­పె­ట్ట­బో­తు­న్న­ట్టు ఆయన పరో­క్షం­గా సం­కే­తా­లి­చ్చా­రు. పూ­ర్తి వి­వ­రా­ల­ను ఇవాళ ఉదయం 9 గం­ట­ల­కు వె­ల్ల­డి­స్తా­మ­ని... ఎవ­రి­కై­నా తె­లి­స్తే చె­ప్పు­కోం­డి చూ­ద్దాం అంటూ సస్పె­న్స్‌­కు తె­ర­లే­పా­రు. "కా­ర్పొ­రే­ట్ బో­ర్డు రూ­ము­ల్లో కొ­న్ని ఆస­క్తి­క­ర­మైన గు­స­గు­స­లు వి­ని­పి­స్తు­న్నా­యి.

Tags:    

Similar News