ఏపీ ఉన్నత విద్యామండలిలో ఖాళీగా ఉన్న పలు కీలక పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ మేరకు ఉన్నత విద్య కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం, ఇద్దరు ప్రముఖ ఆచార్యులను వైస్ చైర్మన్లుగా నియమించారు. ఆచార్య ఎస్. విజయ భాస్కర్ రావు, ఆచార్య రత్నశీలామణి లను వైస్ చైర్మన్ లను గా నియమించింది ప్రభుత్వం. కాగా విజయ భాస్కర్ రావు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం లో ఫిజిక్స్ ప్రొఫెసర్ పనిచేస్తుండగా..రత్నశీలామణి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా సేవలు అందిస్తున్నారు. వీరిద్దరూ మూడేళ్ల పాటు తమ పదవుల్లో కొనసాగుతారు.