ఉద్యోగులు, పింఛనర్లకు దీపావళి కానుకను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఉద్యోగులకు డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జనవరి 1 నుంచి డీఏ అలవెన్స్‌ను 3.64 శాతం పెంచుతూ ఆదేశాలిచ్చింది. డీఏ పెంపు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. రెగ్యులర్ ఉద్యోగుల వేతనంలో ఇప్పటి వరకు డీఏ శాతం 33.67 ఉండగా.. అది 37.31 శాతానికి పెరగనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పెరిగిన డీఏతో పాటు సంబంధిత బకాయి కూడా త్వరలోనే విడుదల చేస్తామని ఏపీ ఆర్థిక శాఖ ప్రకటించింది. కాగా, ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ఒక డీఏను ఇవ్వడానికి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే, నాలుగు డీఏలకు గానూ ఒక డీఏను మాత్రమే విడుదల చేయడం పట్ల ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగుల ఖాతాల్లో డీఏ జమ చేయడానికి ప్రభుత్రానికి ప్రతి నెలా రూ.160 కోట్ల ఖర్చు అవుతున్నట్టు సీఎం తెలిపారు. పోలీసులకు ఈఎల్.. ఒక ఇన్‌స్టాల్ మెంట్ ఎల్ ఇస్తామని.. ఈ ఏఎల్ కింద రూ.105 కోట్లు ఇస్తామని తెలిపారు. మరో రూ.105 కోట్లు జనవరిలో ఇస్తామని హామీ ఇచ్చారు. 60 రోజుల్లోపు ఉద్యోగుల హెల్త్‌కు సంబంధించిన వ్యవస్థను స్ట్రీమ్‌లైన్ చేస్తాన్నారు. అలాగే ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవ్స్ ఎప్పుడైనా వాడుకోవచ్చని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఒక ప్రమోషన్ పెండింగ్‌లో ఉందని..ఈ దీపావళికి RTC ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తామని సీఎం తెలిపారు. కింది స్థాయిలో కొన్ని విభాగాల వారికి గౌరవప్రదమైన డిజిగ్నేషన్ ఇస్తామన్నారు. ఎర్న్ లీవ్ ఒక ఇన్‌స్టాల్‌మెంట్ ఇస్తామని ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ రూ.2,793 కోట్లు ఇచ్చామని తెలిపారు. ఉద్యోగులందరూ దీపావళి ఆనందంగా జరుపుకోవాలి. రేపటి నుంచి మరింత ఉత్సాహంగా పనిచేస్తారని ఆశిస్తున్నానన్నారు.