PAWAN: కశ్మీర్ మనదే.. ఇదే ఫైనల్: పవన్ కల్యాణ్

మధుసూదన్‌రావు కుటుంబానికి రూ.50 లక్షలు: పవన్;

Update: 2025-04-29 07:45 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పాకిస్థాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. "సింధు నదీలో భారతీయుల రక్తం పారుతుంది" అన్న పాక్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో హెచ్చరికలపై పవన్ తీవ్రంగా స్పందించాడు. " పాక్ గత మూడు యుద్ధాలలో ఎలా ఓడిపోయిందో గుర్తు ఉంచుకోవాలి. వారు మళ్లీ అలాగే ప్రయత్నిస్తే నాతో సహా ప్రతీ భారతీయుడు పాకిస్తాన్‌కు వెళ్తాం. ఈ దేశం కోసం మా రక్తాన్ని చిందిస్తాం." అని పవన్ అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పించిన పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'లక్షలాది మంది కశ్మీరీ పండిట్లు వలస వెళ్లిపోయారు. అప్పటి నుంచి కశ్మీర్ మండుతూనే ఉంది. కశ్మీర్‌ భారత్‌లో భాగమే... ఎప్పటికీ అంతే. భారత్‌లో ఉండి కొంత మంది నాయకులు పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారు. పాకిస్తాన్‌పై ప్రేమ ఉంటే అక్కడికి వెళ్లిపోవచ్చు.' అంటూ పవన్ వ్యాఖ్యానించారు.

పవన్ ఆర్థిక సాయం

పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన నెల్లూరు వాసి మధుసూదన్ రావు కుటుంబానికి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. ఆయన కుటుంబానికి రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఏ కష్టం వచ్చినా మధుసూదన్ రావు కుటుంబానికి అండగా ఉంటామని పవన్ హామీ ఇచ్చారు.

Tags:    

Similar News