PAWAN: మీ సేవలు భేష్: పవన్
అటవీ అధికారులను అభినందించిన పవన్... ఎర్రచందనం స్వాధీనంపై హర్షం;
అరుదైన వృక్ష జాతికి చెందిన ఎర్రచందనం పరిరక్షణ చాలా ముఖ్యమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఎర్రచందనం సంరక్షణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 195 ఎర్రచందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు, సిబ్బందిని పవన్ అభినందించారు. అక్రమ స్మగ్లింగ్ చేస్తున్న 8 మంది నేరస్తులను పట్టుకున్న అధికారులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ ఆపరేషన్‌తో ఎంతో విలువైన సహజ సంపదను అధికారులు రక్షించారని చెప్పారు. అధికారుల తిరుగులేని నిబద్ధతకు ఇది నిదర్శనమని అన్నారు. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడంలో మీ అంకితభావం, వేగవంతమైన చర్యలు తీసుకున్న అధికారులను అభినందించారు.
సంస్థాగత నిర్మాణంపై దృష్టి
రాష్ట్రంలో జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిస్తున్నట్టుగా ఆ పార్టీ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులతో గురువారం సమావేశాన్ని ఏర్పాటుచేసి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు త్వరలో పార్టీ బలొపేతానికి నగర కమిటీలతో పాటు, వార్డు కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీని బలొపేతం చేయడానికి ప్రతి జనసైనికుడూ కృషి చేయాలన్నారు.
పవన్ కల్యాణ్ కోసం జన సైనికులు పూజలు
అస్వస్థతకు గురైన రాష్ట్ర ఉపముఖ్య మంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కల్యాణ్ కు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని ఆకాంక్షిస్తూ గురువారం జనసేన నాయకులు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమండ్రి దేవీచౌక్లోని శ్రీ బాలాత్రిపుర సుందరిదేవి, శ్రీ ఉమా బసవలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు, ప్రార్థనలు చేశారు. జనసేన నాయకులు సూర్య బయ్యపునీడి, విక్టరీ వాసు, చక్రపాణి, విన్నా వాసు తదితరులు పాల్గొన్నారు.