AP DSC: నేటి నుంచే ఏపీ డీఎస్సీ మెరిట్‌ లిస్టులు

పూర్తయిన స్పోర్ట్స్‌ కోటా మెరిట్ జాబితా... అభ్యర్థులకు వ్యక్తిగతంగా కాల్‌ లెటర్లు... నేటి నుంచి జిల్లాల్లో మెరిట్ జాబితాలు;

Update: 2025-08-22 04:00 GMT

మెగా డీ­ఎ­స్సీ ఫలి­తా­ల­పై ప్ర­క­ట­న­ల­పై నె­ల­కొ­న్న అను­మా­నా­ల­ను ఆం­ధ్ర­ప్ర­దే­శ్ వి­ద్యా­శాఖ పటా­పం­చ­లు చే­సిం­ది. అభ్య­ర్థు­ల­కు కీలక ప్ర­క­టన చే­సిం­ది. మెగా డీ­ఎ­స్సీ రా­సిన అభ్య­ర్థు­ల­కు వి­ద్యా­శాఖ అధి­కా­రు­లు శు­భ­వా­ర్త చె­ప్పా­రు. స్పో­ర్ట్స్‌ కోటా మె­రి­ట్‌ జా­బి­తా పూ­ర్త­యిన నే­ప­థ్యం­లో నేటి నుం­చి మె­రి­ట్‌ లి­స్ట్‌­లు వి­డు­దల చే­సేం­దు­కు ఏర్పా­ట్లు చే­స్తు­న్న­ట్లు మెగా డీ­ఎ­స్సీ కన్వీ­న­ర్‌ ఎంవీ కృ­ష్ణా­రె­డ్డి వె­ల్ల­డిం­చా­రు. ఈ మె­రి­ట్‌ జా­బి­తా­ను డీ­ఎ­స్సీ అధి­కా­రిక వె­బ్‌­సై­ట్‌ తో పాటు జి­ల్లా వి­ద్యా­శాఖ అధి­కా­రి వె­బ్‌­సై­ట్‌­ల­లో­నూ ఉం­చ­ను­న్న­ట్లు తె­లి­పా­రు. అభ్య­ర్థు­లు అధి­కా­రిక వె­బ్‌­సై­ట్‌ల (ap dsc merit list district wise) నుం­చి మా­త్ర­మే సమా­చా­రం పొం­దా­ల­ని సూ­చిం­చా­రు. వి­విధ కే­ట­గి­రీ­ల­కు సం­బం­ధిం­చిన పో­స్టుల ని­యా­మక ప్ర­క్రి­య­లో భా­గం­గా ‘జో­న్‌ ఆఫ్‌ కన్సి­డ­రే­ష­న్‌’లోకి వచ్చిన అభ్య­ర్థు­ల­కు తమ వ్య­క్తి­గత లా­గి­న్‌ ద్వా­రా కా­ల్‌ లె­ట­ర్‌ అం­దిం­చ­ను­న్న­ట్లు ప్ర­క­ట­న­లో పే­ర్కొ­న్నా­రు. ని­యా­మక ప్ర­క్రియ పా­ర­ద­ర్శ­కం­గా జరు­గు­తోం­ద­న్న ఆయన.. అర్హు­లైన అభ్య­ర్థు­ల­ను పా­ర­ద­ర్శ­కం­గా ని­య­మిం­చ­డ­మే ప్ర­భు­త్వం దృఢ సం­క­ల్ప­మ­ని స్ప­ష్టం చే­శా­రు. టీ­చ­ర్ జా­బ్‌ ఇప్పి­స్తా­మం­టూ దళా­రు­లు చె­ప్పే మా­ట­లు, సో­ష­ల్‌ మీ­డి­యా వే­ది­క­గా అస­త్య వదం­తు­ల­ను నమ్మొ­ద్ద­ని వి­జ్ఞ­ప్తి చే­శా­రు.

ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి

కా­ల్‌ లె­ట­ర్‌ అం­దిన అభ్య­ర్థు­లు తమ ఒరి­జి­న­ల్‌ సర్టి­ఫి­కె­ట్ల­తో పాటు ఇటీ­వల తీ­సు­కు­న్న కుల ధ్రు­వీ­క­రణ పత్రం, గె­జి­టె­డ్‌ అధి­కా­రి­తో ధ్రు­వీ­క­రిం­చిన మూడు సె­ట్ల జి­రా­క్స్‌ కా­పీ­లు, ఐదు పా­స్‌­పో­ర్టు సైజు ఫొ­టో­ల­తో సర్టి­ఫి­కె­ట్ల వె­రి­ఫి­కే­ష­న్‌­కు వ్య­క్తి­గ­తం­గా హా­జ­రు కా­వా­ల్సి ఉం­టుం­ద­ని కన్వీ­న­ర్‌ ఓ ప్ర­క­ట­న­లో సూ­చిం­చా­రు.వె­రి­ఫి­కే­ష­న్‌­కు హా­జ­రు కా­వ­డా­ని­కి ముం­దే అభ్య­ర్థు­లు సం­బం­ధిత సర్టి­ఫి­కె­ట్ల­ను వె­బ్‌­సై­ట్‌­లో అప్‌­లో­డ్‌ చే­య­డం తప్ప­ని­స­ర­న్నా­రు. వె­రి­ఫి­కే­ష­న్‌ సమ­యం­లో సమ­ర్పిం­చా­ల్సిన సర్టి­ఫి­కె­ట్ల వి­వ­రా­ల­తో కూ­డిన చె­క్‌ లి­స్ట్‌­ను డీ­ఎ­స్సీ వె­బ్‌­సై­ట్‌­లో అం­దు­బా­టు­లో ఉం­చ­ను­న్న­ట్లు తె­లి­పా­రు. సర్టి­ఫి­కె­ట్ల పరి­శీ­ల­న­కు హా­జ­రు కా­క­పో­యి­నా, సరైన సర్టి­ఫి­కె­ట్లు సమ­ర్పిం­చ­క­పో­యి­నా, తగిన వి­ద్యా­ర్హ­త­లు లే­న­ట్లు­గా రు­జు­వై­నా మె­రి­ట్‌ లి­స్టు­లో తరు­వాత ఉన్న అభ్య­ర్థు­ల­కు అవ­కా­శం ఇవ్వ­ను­న్న­ట్లు స్ప­ష్టం చే­శా­రు. అభ్య­ర్థు­లు కే­వ­లం అధి­కా­రిక వె­బ్‌­సై­ట్‌­లో ఉన్న ప్ర­క­ట­న­లు, నో­టి­ఫి­కే­ష­న్లు, ఫలి­తా­ల­ను మా­త్ర­మే పరి­గ­ణ­న­లో­కి తీ­సు­కో­వా­ల­న్నా­రు. వ్య­క్తి­గత స్కో­ర్‌­లు, మె­రి­ట్‌ లి­స్ట్‌, ఎం­పిక జా­బి­తా­లు, ని­యా­మక ఉత్త­ర్వు­లు డీ­ఎ­స్సీ వె­బ్‌­సై­ట్‌, క్యాం­డి­డే­ట్‌ లా­గి­న్‌­ల­లో, ప్ర­భు­త్వం వి­డు­దల చేసే ప్ర­తి­కా ప్ర­క­ట­నల ద్వా­రా­నే తాము తె­లి­య­జే­స్తా­మ­న్నా­రు.

Tags:    

Similar News