AP Excise Ministe : శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర

Update: 2025-04-09 11:45 GMT

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదశీర్వచనం అందించగా…. ఆలయ అధికారులు శ్రీ వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ…. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీవారి చల్లని చూపు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. 

Tags:    

Similar News