AP: వక్ఫ్ బోర్డు రద్దుపై ఏపీ ప్రభుత్వం స్పష్టత

సుప్తచేతనావస్థలోకి వెళ్లినందునే 47 జీవో రద్దు చేశామన్న ప్రభుత్వం... త్వరలోనే కొత్త బోర్డును ఏర్పాటు చేస్తామని వెల్లడి;

Update: 2024-12-02 04:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ వక్ఫ్ బోర్డును రద్దు చేసింది. ఈ మేరకు 47 జీవోను ఉపసంహరించింది. త్వరలో కొత్త వక్ఫ్ బోర్డు నియమించేందుకు కసరత్తులు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లోని వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా జగన్ ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డు ఏర్పాటు అయింది. ఇందుకు సంబంధించి అప్పట్లో ప్రభుత్వం 47 జీవోను జారీ చేసింది. అయితే వక్ఫ్ బోర్డు ఆస్తుల్లో అవకతవకలు జరిగినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించి ఆ బిల్లును రద్దు చేసింది. కేంద్రప్రభుత్వం కూడా వక్ఫ్ బోర్డు భూముల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. ఈ మేరకు సవరణ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకుంది. ఈ బిల్లును కూటమి పార్టీలు సమర్థించగా ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బిల్లును స్వాతించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వ్యతిరేకించింది.

వివరణ ఇచ్చిన ప్రభుత్వం

ఏపీలో వక్ఫ్ బోర్డు ఏర్పాటు జీవోను ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. అందుకు కారణం కూడా చెప్పింది .. ఏమిటంటే ఆ వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేశారు కానీ ఇంకా చార్జ్ తీసుకోలేదు. హైకోర్టులో అనేక పిటిషన్లు పడ్డాయి. పేరుకే జీవో ఉంది దాన్ని క్యాన్సిల్ చేసేసి కొత్త వక్ఫ్ బోర్డును నియమిస్తూ జీవో జారీ చేయాలని ప్రభుత్వం అనుకుంది. ఈ మేరకు జీవోను క్యాన్సిల్ చేశారు. కొత్త వక్ఫ్ బోర్డు ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించారు. జగన్ సర్కార్ జారీ చేసిన జీవో నంబర్ 47ను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇంకా చెప్పాలంటే మార్చి 2023 నుంచి వక్ఫ్ బోర్డు సభ్యులు పని చేయడం లేదు. దీంతో, వక్ఫ్ బోర్డులో పరిపాలన సుప్తచేతనావస్థలోకి వెళ్లిపోయింది. దీంతో, తప్పనిసరి పరిస్థితుల్లో జీవో నెం.47 ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని ఏపీ సర్కార్ క్లారిటీనిచ్చింది. దానికితోడు వక్ఫ్ బోర్డులో అంతర్గత వివాదాలు, సమస్యల వల్ల చైర్మన్‌ నియామకం సమస్యగా మారిందని వెల్లడించింది.

ఆస్తుల పరిరక్షణకే...

వర్క్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు, సుపరిపాలన కోసం 47 జీవోను వెనక్కు తీసుకున్నామని ఏపీ సర్కార్ క్లారీటీ ఇచ్చింది. అందుకే, వక్ఫ్ బోర్డులో ప్రస్తుతం ఉన్న లోపాలను సరిదిద్ది త్వరలోనే కొత్త సభ్యులతో, ఛైర్మన్ తో వక్ఫ్ బోర్డును నూతనంగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం వక్ఫ్ బోర్డు అనేది జాతీయ స్థాయిలో కీలక అంశంగా ఉంది. వక్ఫ్ బోర్డు చట్టసవరణ బిల్లు పార్లమెంట్లో ఉంది. జేపీసీ వద్ద ఉంది. జేపీసీ అభిప్రాయం పార్లమెంట్ కు వచ్చిన తర్వాత ఓటింగ్ నిర్వహిస్తారు. జరుగుతున్న సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెడతారని అంటున్నారు. అందుకే ఏపీలో వక్ఫ్ బిల్లు రద్దు అనగానే విస్తృతంగా ప్రచారం జరిగిపోయింది. చివరికి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ వెనుకబడిపోయింది కానీ.. క్యాన్సిల్ చేసిన జీవో మాత్రం వైరల్ అయిపోయింది.

Tags:    

Similar News