ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. రాజధాని అమరావతి నిర్మాణాలకు అవసరమైన ఇసుకను కృష్ణా నది నుంచి తవ్వి తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన డీసిల్టేషన్‌కు రూ.286 కోట్లు ఇచ్చేందుకు కావలసిన అనుమతులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. టెండర్ల బాధ్యతలను జల వనరుల శాఖ, పర్యవేక్షణను సీఆర్డీఏకు అప్పగించింది. అన్ని అనుమతులు, నిబంధనల మేరకు మాత్రమే ఇసుకను తవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవవూపు శ్రీశైలం ప్రాజెక్ట్ ఎగువ నుంచి వరద ఉధృతి ఒక్కసారిగా తగ్గడంతో ప్రాజెక్ట్ గేట్లను అధికారులు మూసివేశారు.