AP Current Charges: ఏపీలో ప్రజలపై మరో పిడుగు.. భారీగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు..
AP Current Charges: ఏపీలో సామాన్యులపై జగన్ ప్రభుత్వం మరో పిడుగు వేసింది.;
ap current charges: ఏపీలో సామాన్యులపై జగన్ ప్రభుత్వం మరో పిడుగు వేసింది. విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచేసింది. 30 యూనిట్లలోపు వాడే వారికి యూనిట్‌కు 45పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 31-75 యూనిట్లలోపు వాడకానికి 91పైసల పెంచారు. 76-125 యూనిట్లలోపు వాడే వారిపై రూ.1.40 పెంచారు.
గతంలో 30 యూనిట్ల లోపు వాడితే యూనిట్‌కి రూపాయి 45 పైసలు ఉంటే.. ఇప్పుడది రూపాయి 90 పైసలకు చేరింది. ఇక 31 నుంచి 75 యూనిట్ల వరకూ వాడే వారిపై సుమారు రూపాయి అదనపు భారం పడింది. గతంలో ఈ టారిఫ్‌లో యూనిట్ 2 రూపాయల 9 పైసలు ఉంటే.. ఇప్పుడు అది 3 రూపాయలు అయ్యింది.
ఇక 76 యూనిట్ల నుంచి 125 యూనిట్లు వాడే మధ్య తరగతి వారిపైనా భారీగా భారం పడుతోంది. ప్రస్తుతు 3 రూపాయల 10 పైసలుగా ఉన్న ధర ఇకపై 4 రూపాయల 50 పైసల అవుతోంది. అంటే ఏకంగా యూనిట్‌పై రూపాయి 40 పైసలు పెరిగింది.