Free Sand Distribution : ఉచిత ఇసుకపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

Update: 2024-07-08 11:50 GMT

ఉచిత ఇసుకపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కలెక్టర్ ఛైర్మన్‌గా జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేసింది. ఇందులో SP, JC, వివిధ శాఖల అధికారులు ఉంటారు. ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీల బాధ్యతను జిల్లా కమిటీలే పర్యవేక్షిస్తాయి. ఇసుకను తిరిగి అమ్మినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఉచిత ఇసుకను భవన నిర్మాణాలకు మాత్రమే వాడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

వైసీపీ ప్రభుత్వంలోని 2019, 2021 ఇసుక విధానాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన రెండు ఇసుక పాలసీలను రద్దు చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉచిత ఇసుకపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది. 2024 కొత్త ఇసుక విధానాన్ని రూపొందించేంత వరకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఇసుక సరఫరాపై మార్గదర్శకాల విడుదల చేసింది. ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ చైర్మన్‌‌గా జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. జిల్లా ఇసుక కమిటీల్లో జిల్లా ఎస్పీ, జేసీ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఉండనున్నారు. జిల్లాల్లోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలకు సర్కార్ సూచనలు చేసింది.

Tags:    

Similar News