సైన్స్ ఎక్స్పోజర్ టూర్లో భాగంగా ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 52 మంది విద్యార్థులు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం జిల్లాకు ఇద్దరు చొప్పున 52 మంది విద్యార్థులను అధికారులు ఎంపిక చేశారు. సమగ్ర శిక్ష అభియాన్, ఏపీ సైన్స్ సిటీ విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులు దిల్లీ వెళ్లారు. తొలి రోజు ఘజియాబాద్‌లోని కైట్ ఇంజినీరింగ్ కాలేజీలో రాకెట్ పరిజ్ఞానంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాకెట్ పనితీరు, తయారీ తదితర విషయాలను నేర్చుకునేందుకు ఉన్న అంశాలపై విద్యార్థులకు కైట్ ఇంజినీరింగ్ కాలేజీ అధ్యాపకులు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడుతో ఈ విద్యార్థులు భేటీ అయ్యారు. నేడు ఢిల్లీలోని రష్యన్ కల్చర్ సెంటర్‌కు వెళ్లనున్నారు. అక్కడ భారత్-రష్యా స్పేస్ సంబంధాలు, స్పుత్నిక్ తయారీ వంటి అంశాలను రష్యా అధికారులు విద్యార్థులకు వివరిస్తారు. శనివారం జాతీయ సైన్స్ మ్యూజియం, రాకెట్ వర్క్‌షాప్, మోడల్ రాకెట్ తయారీ, నెహ్రూ ప్లానిటోరియం, ప్రధాని సంగ్రహాలయాన్ని సందర్శించనున్నారు.