కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ లెక్చరర్లకు ఏపీ సర్కార్ షాక్..!
మార్చిలో లెక్చరర్ల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం... జులైలో 58ఏళ్లకు కుదిస్తూ ఉత్తర్వులు వెలువరించింది.;
కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ లెక్చరర్లకు ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. మార్చిలో లెక్చరర్ల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం... జులైలో 58ఏళ్లకు కుదిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. తాజాగా సవరించిన ఉత్తరుల్ని అమలు చేయాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ తీరుపట్ల కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ లెక్చరర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.