AP High Court: జంబ్లింగ్ విధానంలో ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహించడంపై ఏపీ హైకోర్టు తీర్పు..
AP High Court: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది.;
AP High Court: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. జంబ్లింగ్ విధానంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని.. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం విద్యార్థులు.. ఎవరి కాలేజీలో వారే పరీక్షలు రాస్తారని ఆదేశించింది. లాయర్ మతుకిమిల్లి శ్రివి పిటిషనర్లు తరఫున వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం జంబ్లింగ్ ఉత్తర్వులను కొట్టేసింది.