విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో విచారణ

AP High court: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది.. ప్రైవేటీకరణను సవాల్‌ చేస్తూ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది హైకోర్టు.;

Update: 2021-07-23 07:15 GMT

AP High court

AP High court: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది.. ప్రైవేటీకరణను సవాల్‌ చేస్తూ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది హైకోర్టు. కౌంటర్‌ దాఖలు చేసేందుకు సోమవారం వరకు కేంద్ర ప్రభుత్వం సమయం కోరగా.. కౌంటర్‌ దాఖలు చేయడంలో కేంద్రం తాత్సారం చేస్తోందని పిటిషనర్‌ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. దీంతో ఇదే చివరి అవకాశమని, కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.. పిటిషనర్‌ తరపున సీనియర్‌ కౌన్సిల్‌ బండారు ఆదినారాయణ, న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు.

ఈనెల 29న బిడ్డింగ్‌కు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటోందని పిటిషనర్స్‌ తరపు న్యాయవాదులు వాదించారు.. ఈ నేపథ్యంలో బిడ్డింగ్‌పై కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది.. అయితే, అలాంటిదేమీ లేదని కేంద్రం వివరణ ఇచ్చింది.. దీంతో తదుపరి విచారణను వచ్చేనెల రెండుకు వాయిదా వేసింది.

Tags:    

Similar News