AP High Court: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాకుల మీద షాకులు.. కేంద్ర ప్రభుత్వ పథకాల విషయంలో..

AP High Court: జగన్ ప్రభుత్వానికి కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చడంపై సీరియస్ అయింది.

Update: 2021-12-03 16:30 GMT

AP High Court (tv5news.in)

AP High Court: జగన్ ప్రభుత్వానికి కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చడంపై సీరియస్ అయింది. కేంద్ర పథకాలకు జగనన్న గోరుముద్దలు, జగనన్న పాలు పెట్టడంపై వార్నింగ్ ఇచ్చింది. మొన్న పంచాయతీ నిధులను ప్రభుత్వం వాడేసుకోవడంపై మండిపడింది కేంద్రం. వైసీపీ సర్కారు పథకాల పేర్లు మార్చడం, నిధుల గోల్‌మాల్‌పై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించడం చర్చనీయాంశమైంది.

సొమ్మొకడిది.. సోకొకడిది అన్న చందంగా వ్యవహరిస్తున్న వైసీపీ ప్రభుత్వం తీరుపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. కేంద్రం నిధులను పక్కదారి పట్టించడం, కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి తమ ఘనతగా చెప్పుకుంటున్న జగన్ సర్కారును కేంద్రం కడిగిపారేసింది. పోషణ్ అభియాన్, కేంద్ర ప్రాయోజిత పథకాల పేర్లును ఏపీ ప్రభుత్వం మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్ల మార్పుపై ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఫిర్యాదు చేశారు. ఎంపీ రఘురామ ఫిర్యాదుతో స్పదించిన కేంద్ర ప్రభుత్వం.. జగన్‌ సర్కారుకు హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శికి కేంద్ర మహిళా శిశు సంక్షేమ అభివృద్ధిశాఖ లేఖ రాసింది. పోషణ్ అభియాన్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్స్, ఇంటిగ్రేటెడ్ ఛైల్మ్ డెవలప్‌మెంట్ స్కీమ్స్ పేర్లను జగనన్న గోరుముద్దలు, జగనన్న పాలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పేర్లుగా మార్చినట్టు తమ దృష్టికి వచ్చిందని లేఖలో పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను మార్చడం కుదరదని తేల్చి చెప్పింది. తక్షణం చర్యలు తీసుకోవడంతో పాటు తీసుకుంటున్న చర్యలపై నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశించింది. అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐసీడీఎస్, ఐసీపీఎస్ పథకాలకు కేటాయించిన 187 కోట్ల రూపాయలకు లెక్క చూపాలని కేంద్రం స్పష్టంచేసింది.

ఇటీవల గ్రామ పంచాయతీ నిధులను జగన్ ప్రభుత్వం లాగేసుకోవడంపై కేంద్రం సీరియస్ అయింది. 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన 1300 కోట్ల రూపాయల నిధులను విద్యుత్ బకాయిల పేరిట పంచాయతీల నుంచి డ్రా చేసింది జగన్ సర్కారు. 14వ ఆర్ధిక సంఘం ఇచ్చిన 356 కోట్లతో పాటు, 15వ ఆర్ధిక సంఘం ఇచ్చిన 944 కోట్లను జగన్‌ ప్రభుత్వం విద్యుత్ బకాయిల పేరుతో జమచేసుకుంది.

ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై పంచాయతీలు ప్రత్యేక అకౌంట్లు ఓపెన్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. 15వ ఫైనాన్స్ కమిషన్ విడుదల చేసే నిధులను నేరుగా పంచాయతీలు తెరిచే ప్రత్యేక ఖాతాలకే జమ చేస్తామని కేంద్రం తెలిపింది. మొత్తానికి జగన్ సర్కారు గోల్‌మాల్ వ్యవహారంపై దృష్టి సారించిన కేంద్రం.. షాకులు మీద షాకులు ఇస్తోంది.

Tags:    

Similar News