Online Movie Tickets: ఆన్‌లైన్ మూవీ టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు..
Online Movie Tickets: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది..;
Online Movie Tickets: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.. సినిమా టికెట్ల ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వమే విక్రయించేందుకు వీలుగా గత ఏడాది సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం.. ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది.. ప్రతివాదులుగా ఉన్న న్యాయ, శాసన శాఖ కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు నోటీసులు జారీ చేసింది.. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది.. గతంలో మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలు దాఖలు చేసిన వ్యాజ్యంతో కలిపి ప్రస్తుత వ్యాజ్యాన్ని విచారిస్తామని చెప్పింది.. ఆ రోజు విచారణలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామని పేర్కొంది.. విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.