పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు
ఏపీలో పరిషత్ పోరుకు బ్రేక్ పడింది. ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది.;
ఏపీలో పరిషత్ పోరుకు బ్రేక్ పడింది. ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. నోటిఫికేషన్‌కు, పోలింగ్‌కు మధ్య నాలుగు వారాల సమయం ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల్ని ఎస్‌ఈసీ పాటించలేదని హైకోర్టు ఆక్షేపించింది. ఈ నెల 15లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఎస్‌ఈసీని ఆదేశించింది. టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు... ఎన్నికలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్లుండి పోలింగ్ అనగా... ఇవాళ హైకోర్టు ఉత్తర్వులతో ఎన్నికలకు బ్రేక్ పడింది.
ఏప్రిల్ 1న నూతన బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎస్‌ఈసీ నీలం సాహ్నీ పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. హడావుడిగా నోటిఫికేషన్ జారీ చేయడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ మేరకు హైకోర్టులో టీడీపీ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికలకు బ్రేక్ వేసింది. గతంలో పరిషత్ పోరు నిలిచిపోగా... ఆగిన చోట నుంచే ప్రక్రియ కొనసాగిస్తున్నట్టు.. మార్చి 15న కోర్టుకు ఎస్‌ఈసీ అఫిడవిట్ సమర్పించింది.