ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు వేగం పెంచిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పలువురు అధికారులను విచారించిన సిట్ కొందరిని అరెస్ట్ చేసింది. గత వైసిపి ప్రభుత్వం హయాంలో మద్యం సేకరణ, పంపిణీ, ధరల నిర్ణయంలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కి సైతం నోటీసులు ఇవ్వగా...ఆయన ఈరోజు సిట్ విచారణకు హాజరుకావాల్సి ఉంది.
అయితే ఈరోజు విచారణకు రాలేనని అధికారులకు సమాచారం ఇచ్చారు విజయసాయి రెడ్డి. తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటం వలన విచారణ కు రాలేకపోతున్నానని తెలిపారు. కాగా ఇప్పటికే ఒకసారి విచారణ కు హాజరయ్యారు విజయసాయిరెడ్డి .మరో రెండు రోజుల్లో తాను ఎప్పుడూ విచారణకు వచ్చి అంశం పై క్లారిటీ ఇస్తానన్నారు.
ఐతే నిన్న విచారణ కు హాజరుకావాల్సిన రిటైర్డ్ అధికారి డాక్టర్ రజత్ భార్గవ సైతం అనారోగ్య కారణాల వల్ల తాను విచారణ కు రాలేనని అధికారులకు సమాచారం ఇచ్చాడు..ఈ క్రమంలో విజయసాయి రెడ్డి కూడా విచారణ కు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాకుండా ఎక్స్లో ఆయనో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఎవరైతే కర్మను చేస్తారో వారు అనుభవించక తప్పదు అనే విధంగా భగవద్గీతకు సంబంధించి ఓ శ్లోకాన్ని పోస్టు చేశారు విజయసాయిరెడ్డి..